అనుమానం పెనుభూతమై రక్కసిలాగ తయారు అవుతోంది. దీంతో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొంతమంది క్షణికావేశంలో హత్యలకు పాల్పడుతుంటే.. మరికొంతమంది అవమాన భారం తట్టుకోలేక.. మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడతున్నారు. తాజాగా జరిగిన ఘటన కూడా ఈ కోవలోకి చెందిందే.. భార్యపై అనుమానంతో కట్టుకున్న భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనుమానంతో భార్యను హత్యచేసి ఇంటికి తాళం వేసి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని మూసాపేట లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు.
ఒడిశా రాష్ట్రం రంప గ్రామానికి చెందిన పుణ్యవతి అలియాస్ భవాని శిరీష(25) శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్ట గ్రామానికి చెందిన సంతోష్ (28)తో ఈ ఏడాది మేలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో శిరీష తల్లిదండ్రులు రూ.3 లక్షలు, బంగారం, ఇతర వస్తువులు కట్నంగా ఇచ్చారు. వివాహం తర్వాత అతడు తన భార్యతో కలసి హైదరాబాద్ లో ఉటుంన్నాడు. అతడు హైదరాబాద్ మూసాపేట గూడ్స్ షెడ్ వద్ద వెల్డింగ్ షాప్ నడుపుతున్నాడు. భార్యపై అనుమానంతో గడిచిన ఆరు నెలల్లో నాలుగు ఇల్లులు మారాడు సంతోష్. తాజాగా వెల్డింగ్ షాప్ ఎదురుగా ఉన్న ఇంట్లోనే అద్దెకు దిగాడు.
సంతోష్ తన భార్య విశ్వసనీయతను అనుమానించి మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. గత ఆరు నెలలుగా అతను తరచూ గొడవలు పడేవాడు. దీనిపై పోలీసులకు అతన భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి.. మరో సారి ఇలాంటివి రిపీట్ కావద్దు అంటూ.. ఇరు కుటుంబసభ్యులను కూడా హెచ్చరించారు. ఇలా గత వారంలో రెండుసార్లు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో.. మళ్లీ వేధించడం మొదలు పెట్టేశాడు. రెండు రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దదైంది. ఈ నేపథ్యంలోనే అతడు ఆమెను క్షణికావేశంలో హత్య చేశాడు.
అంతే కాకుండా భార్య మృతదేహం ఇంట్లోపెట్టి బయట తాళం వేసి పారిపోయాడు. మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లో ఉంచి మెయిన్ డోర్‌కు బయట నుంచి తాళం వేసి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడంతో మరుసటి రోజు ఉదయం బంధువులు దంపతుల ఇంటికి రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇరుగుపొరుగు వారి సహాయంతో తాళం పగులగొట్టి చూడగా శిరీష లోపల శవమై కనిపించింది.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకొని మృతదేహం స్వాధీనం చేసుకొని పోస్టుమార్టంకి పంపారు. తన భర్త హత్యచేసి ఉంటాడని పోలీసులు భావించారు. గొంతు, మొహంపై గాయాలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. సంతోష్ పై అనుమానం వ్యక్తం చేసిన కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సంతోష్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cirme, Crime news, Hyderabad crime