Home /News /telangana /

HYDERABAD NEW YEAR CELEBRATIONS BUSINESS HUGE DOWN AMID OMICRON FEARS THOUGH GOVT OKAYS EVENTS WITH COVID PRECAUTIONS MKS BK

Hyderabad : న్యూ ఇయర్ బిజినెస్ 50 శాతం ఢమాల్.. డైల‌మాలో ఈవెంట్స్ నిర్వహాకులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూ ఇయ‌ర్ వేడుకల కోసం ఐదారు నెలలు ముందుగానే హోట‌ళ్లు, ప‌బ్బు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, ఫామ్ హౌజుల్లో భారీ ఈవెంట్లకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ దెబ్బకు ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహణ దాదాపు డైలమాలో పడింది.

    మరికొద్ది గంటల్లో మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం.. న్యూ ఇయర్ కు స్వాగతం పలికేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు.. కొత్త ఏడాదికి సంబంధించి సిటీలో కొద్ది పాటి ఏర్పాట్లు జ‌రుగుతున్నా.. అంద‌ర్లో ఒక అనిశ్చితి మాత్రం అలానే ఉంది. న్యూ ఇయ‌ర్ వేడుకల కోసం ఐదారు నెలలు ముందుగానే హోట‌ళ్లు, ప‌బ్బు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, ఫామ్ హౌజుల్లో భారీ ఈవెంట్లకు ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఒమిక్రాన్ కరోనా వేరియంట్ దెబ్బకు ఇప్పుడు ఈవెంట్స్ నిర్వహణ దాదాపు డైలమాలో పడింది. మిగతా రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలను నిషేధించనప్పటికీ, కఠిన ఆంక్షలు విధించిన దరిమిలా ఈవెంట్స్ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఒక అచనా ప్రకారం హైదరాబాద్ న్యూ ఇయర్ ఈవెంట్స్ బిజినెస్ 50శాతానికిపైగానే పడిపోయింది..

    క‌ట్టుదిట్ట‌మైన కోవిడ్ నిబంధ‌న‌ల మధ్య కొత్త ఏడాదిని వేడుకలా జరుపుకోడానికి ఎంత మంది ఇష్టపడతారనేది అనుమానాలు ఈవెంట్స్ నిర్వ‌హాకుల్లో ఉన్నాయి. అందుకే మ‌రో మూడు రోజుల్లో న్యూఇయ‌ర్ ఉన్న‌ప్ప‌టికి ఎటూ తేల్చుకోలేక‌పోతున్నాయి. తెలంగాణ ప్ర‌త‌భుత్వం  న్యూ ఇయ‌ర్ వేడుకలపై నిషేధం విదించనప్పటికీ, నియమ నిబంధనలు జారీ చేయడంతో ఈవెంట్స్ స‌క్సెస్ అవుతాయా? లేదా? అని హోటళ్లు, పబ్బుల నిర్వాహకులు యోచిస్తున్నారు.

    badminton player : అయ్యో.. ఆదిలక్ష్మి! బ్యాడ్మింటన్ యువ కెరటం చివరి మెసేజ్ కన్నీళ్లు ఆగవు



    ప్రభుత్వం ఇచ్చిన పాక్షిక అనుమతులతో న్యూ ఇయర్ ఈవెంట్స్ సక్సెస్ అవుతాయనే నమ్మకం నిర్వాహకుల్లో కనిపించడంలేదు. న్యూ ఇయర్ వేడుకల విషయంలో నిర్వాహకులు వెయిట్ అండ్ వాచ్ మోడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనాకు ముందు ప్ర‌తీ ఏడాది న్యూఇయ‌ర్ కి నగరంలో పెద్ద పెద్ద ఈవెంట్‌లు, స్టార్ పార్టిసిపేషన్,  డ్యాన్స్ ఫ్లోర్‌లతో ఉత్సాహంగా ఉండేది. కోవిడ్, ఓమిక్రాన్ రాకతో ఈవెంట్లు వెలవెల‌బోయే ప‌రిస్థితికి చేరాయి. ప‌రిమిత సంఖ్యలో అతిథులతో కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం సంగీత కచేరీలు, వినోద కార్యక్రమాలకు పక్కాగా ప్లాన్ చేసుకున్నాయి.

    shocking : ఎలిజబెత్ రాణిని ఏసేస్తా.. సిక్కు యువకుడి సంచలన వీడియో.. అసలేం జరిగిందంటే..



    “తెలంగాణలో ఓమిక్రాన్ వ్యాప్తి రోజు రోజుకీ పెరుగుతోంది. గతేడాదిలాగే ఈ సారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పైనా కరోనా ఎఫెక్ట్ పడింది. న్యూ ఇయ‌ర్ ఈవెంట్స్ బిజినేస్ గ‌త రెండేళ్ల‌ల్లో 50 శాతానికి పడిపోయింది. కొత్త వేరియంట్ దెబ్బకు వ్యాపారం ఇంకాస్త కుదేలయ్యే పరిస్థితి. న‌గరంలో ఉన్న పబ్‌లు, హోటళ్లు న్యూ ఇయ‌ర్ ఈవెంట్స్ చేయ‌డానికే భయపడుతున్నాయి. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఈవెంట్స్ ప్లాన్ చేసినా తీరా జనం రాకపోతే చాలా న‌ష్టం వస్తుంది’అని స్పైసీ వెన్యూ ఎండీ, నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) కో-చాప్టర్ హెడ్ తుమ్మల శ్రీనివాస్ సంపత్ న్యూస్ 18కి చెప్పారు.
    Published by:Madhu Kota
    First published:

    Tags: Hyderabad, New Year 2022, Omicron, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు