HYDERABAD NEW TWIST HAS CAME IN HYDERABAD DRUG CASE THAT ANOTHER 15 BUSINESS MAN MIGHT BE INVOLVED IN THAT ROCKET PRV
Hyderabad Drug case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో మరో కొత్త ట్విస్టు.. కేసులో ఆ ఏడుగురితో పాటు మరో 15 మంది బడా వ్యాపారవేత్తలు?
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు (Hyderabad Drug case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను (Businessman) అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు వ్యాపారులు గజేంద్ర, విపుల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసు (Hyderabad Drug case)లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏడుగురు వ్యాపారవేత్తలను (Businessman) అరెస్ట్ చేసిన పోలీసులు.. మరో ఇద్దరు వ్యాపారులు గజేంద్ర, విపుల్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. హైదరాబాద్‌లో బడా పారిశ్రామిక వేత్తలుగా కొనసాగుతున్న గజేంద్ర, విపుల్‌లు టోనీ అనే వ్యక్తి దగ్గర్నుంచి కొన్నేళ్లుగా డ్రగ్స్ (Drugs) తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో రూ. 500 కోట్ల పైచిలుకు వ్యాపారం చేస్తున్న వ్యాపారవేత్తలు.. మరో 15 మందికి టోనీ డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు (Police) గుర్తించారు. గుర్తించిన 15 మంది వ్యాపారవేత్తల వద్ద వివరాలను సేకరిస్తున్నారు. వీరంతా రాజకీయ వ్యాపార రంగాలకు చెందిన వారై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈనెల 28 వ తేదీ..
మరోవైపు తెలంగాణ (Telangana)లో మాదక ద్రవ్యాల( Drugs ) వాడకం అనే మాటే వినపడకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (Chief minister K Chandra Sekhar Rao) అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా .. డ్రగ్స్ (Drugs) వాడకాన్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టే దిశగా.. ఈనెల 28 వ తేదీ శుక్రవారం నాడు ( ఎల్లుండి ) ప్రగతిభవన్ లో ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’ జరపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరుగనున్న ఈ సదస్సు (Meeting) లో రాష్ట్ర హోం మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ, డీజీలు, అన్ని జిల్లా ల ఎస్పీలు (SP), కమిషనర్లు, డీసీపీ (DCP) అధికారులు వారితో పాటు రాష్ట్ర ఎక్సైజ్ పోలీస్ శాఖకు చెందిన ఎస్పీలు సంబంధిత ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు.
పాశ్చాత్య సంస్కృతి కూడా..
హైదరాబాద్ (Hyderabad) మహానగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. దానితో పాటు పాశ్చాత్య సంస్కృతి కూడా పాతుకుపోతోంది. ఇప్పటికే పబ్‌లు, డ్రగ్స్ హైదరాబాద్‌ను కుదిపేస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ డ్రగ్స్ (Drugs)విషయంపై సీరియస్ (Serious) అయ్యారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల వాడకాన్ని కఠినంగా నియంత్రించేందుకు (To strictly control drug use in Telangana) చేపట్టాల్సిన కార్యాచరణ విధి విధానాలను ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ మేరకు పోలీసు శాఖ , ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేయనున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష..
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించే (Controlling) దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యల పై బుధవారం ప్రగతి భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (CS Somesh kumar) , డీజీపీ మహేందర్ రెడ్డి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో (Meeting) సీఎంవో ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.