హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గ్రేట్..ఎంపీ సంతోష్‌కు అవార్డు అందించిన నెట్‌వర్క్‌18

Hyderabad: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గ్రేట్..ఎంపీ సంతోష్‌కు అవార్డు అందించిన నెట్‌వర్క్‌18

Green India Challenge:పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సారధి రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను అభినందిస్తూ  గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్‌గా గుర్తించి అవార్డును అందజేసింది జాతీయ మీడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరో వినూత్న అవార్డు

గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్‌గా ఎంపీ సంతోష్ కుమార్ కు గుర్తింపు

పర్యావరణ రక్షణకు పాటుపడినందుకు అవార్డు

అందించిన ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్

ప్రకృతి బాగుంటేనే ప్రజలు బాగుంటారు. దేశం పచ్చగా వృక్షాలతో నిండి ఉండాలని .. పర్యావరణాన్ని కాపాడుతూ కాలుష్య నివారణకు శాశ్వత పరిష్కారమార్గం చూపించే శ్రీకారం చుట్టిన కార్యక్రమమే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌(Green India Challenge). బీఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌(J.Santoshkumar) చేపడుతున్న ఈకార్యక్రమాన్ని అభినందిస్తూ ఎంపీ సంతోష్‌కు ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్‌వర్క్ 18గ్రూప్(Network 18Group) గ్రీన్‌ రిబ్బన్ ఛాంపియన్‌ అవార్డు(Green Ribbon Champion Award)ను అందజేసింది. నెట్‌వర్క్‌18 మీడియా సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈకార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములైన లక్షలాది మందికి ఈ గుర్తింపు వర్తిస్తుందని జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్వీట్టర్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

గ్రీన్‌ రిబ్బన్ ఛాంపియన్..

పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అరుదైన గౌరవం దక్కింది. ఈకార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నెట్‌వర్క్‌18 గ్రీన్‌ రిబ్బర్ ఛాంపియన్‌గా గుర్తిస్తూ అవార్డు అందజేసింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సారధి రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్‌ను గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్‌గా గుర్తిస్తూ నెట్ వర్క్ 18 గ్రూప్ అవార్డును అందించింది.

అవార్డు అందుకున్న ఎంపీ..

గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎం.పీ హాజరు కాలేక పోయారు. దీంతో ఇవాళ నెట్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి ఎం.పీ సంతోష్ కుమార్‌ను హైదరాబాద్‌లో కలిసి అవార్డును అందించారు.

స్పూర్తితో మరింత ముందుకు తీసుకెళ్తాం..

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్ప్రహ, అన్ని వర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు నెట్ వర్క్ 18 గ్రూప్ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచిఉన్న పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు.నెట్‌వర్క్‌18 మీడియా సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈకార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. ఈ గుర్తింపు తన ఒక్కడిదే కాదని ..ఈకార్యక్రమంలో భాగస్వాములైన లక్షలాది మందికి చెందుతుందని వారందరికి ధన్యవాదాలు తెలిపారు.

First published:

Tags: Green india challenge, Network18, Telangana News

ఉత్తమ కథలు