హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: కేటీఆర్ కు నెటిజన్ల చురకలు.. అడ్డంగా దొరికిపోయారుగా..!

KTR: కేటీఆర్ కు నెటిజన్ల చురకలు.. అడ్డంగా దొరికిపోయారుగా..!

మంత్రి కేటీఆర్ (File Image)

మంత్రి కేటీఆర్ (File Image)

హైదరాబాద్ లోని అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి ఎప్పుడువుతంది, రోడ్డు వర్క్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామంటూ ఓ నెటిజన్ కేటీఆర్ కు తన బాధను వెల్లడించాడు.‘

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రజల సమస్యలకు ట్విట్టర్ ద్వారానే సమాధానమిచ్చే తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడైన కేటీఆర్ కు ఆదివారం ఆ ట్విటర్ వేదికగానే నెటిజన్లు చురకులు అంటించారు. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (SRDP) గురించి ట్విట్టర్ వేదిక ద్వారా కేటీఆర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా.. హైదరాబాద్ లోని అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి ఎప్పుడువుతంది, రోడ్డు వర్క్ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నామంటూ ఓ నెటిజన్ కేటీఆర్ కు తన బాధను వెల్లడించాడు.‘కేటీఆర్ సార్ ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. నారపల్లి నుంచి రోజూ వచ్చే వారికి చాలా ఇబ్బందిగా ఉంటోంది’ అని ట్వీట్ చేశాడు.

ఎప్పటిలాగే కేటీఆర్ కూడా దీనికి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చాడు. పనులు నత్తనడకన సాగుతుండటానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)నే కారణమంటూ.. పేర్కొన్నాడు. జీహెచ్ఎంసీ భూ సేకరణ పూర్తి చేసి ఇచ్చినా.. NHAI పనులు వేగంగా పూర్తిచేయడం లేదన్నారు. అంతటితో ఆగకుండా.. కేసీఆర్ నేతత్వంలోని రాష్ట్రప్రభుత్వానికి, మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మధ్య పోలికను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ‘ఉప్పల్, అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ల పనులు దురదృష్టవశాత్తూ NHAI ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ భూసేకరణ చేసి ఇచ్చినా పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మేం 35 ప్రాజెక్టులు పూర్తిచేశాం. వారు రెండు ప్రాజెక్టులు పూర్తిచేయలేకపోతున్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వానికి, మోదీ ప్రభుత్వానికి ఉన్న తేడా’ అని పేర్కొన్నారు.

దీంతో నెటిజన్లు.. కేటీఆర్ ఫ్యాక్ట్-చెక్ చేసుకోవాలంటూ స్పందించడం మొదలుపెట్టారు. ప్రస్తుత కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి.. గతంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు రాసిన లేఖను ఓ నెటిజన్ పోస్టు చేశారు. ‘కిషన్ రెడ్డి గారు అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన అడ్డంకులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఇది’ అని లేఖను పోస్టు చేశారు.

జూన్ 2020లో.. రాసిన ఆ లేఖలో అంబర్‌పేట్ ఫ్లై ఓవర్ నేషనల్ హైవే 202లో భాగమని, ఈ రోడ్డును త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన భూసేకరణ కోసం రూ.76 కోట్లను మంజూరు చేసినప్పటికీ.. జీహెచ్ఎంసీ బాధితులకు ఇంతవరకు పరిహారాన్ని అందించకపోవడాన్ని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

భారతీయ రాష్ట్ర సమితికి ఆత్మీయ మిత్రుడైన, ఒవైసీ సోదరుల నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ కారణంగానే ఈ పనులు ఆలస్యం అవుతున్నాయని మరో నెటిజన్ పోస్టు చేశాడు.‘మిస్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ మరో అబద్ధం ఆడారు. జీహెచ్ఎంసీ వైపునుంచే భూసేకరణ పెండింగ్ లో ఉంది (6 నెంబర్ క్రాస్ రోడ్డు మార్గంలో లక్ష్మి అపార్ట్‌మెంట్ ప్రస్తావన). బీఆర్ఎస్ మిత్రుడైన మజ్లిస్ ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు కలిగిస్తోంది. ఈ సమస్యలోని అడ్డంకులు తొలగించాలంటూ కిషన్ రెడ్డి గారు చాలా లేఖలు రాశారు’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.

మీరు చేసిన తప్పులకు ఇతరులపై నెపం నెట్టొద్దంటూ మరో నెటిజన్ పేర్కొన్నాడు.

1. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఆలస్యానికి కారణం.. విద్యుత్, వాటర్ లైన్లను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ సరైన సమయంలో షిప్ట్ చేయకపోవడం

2. అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ఆలస్యానికి భూ సేకరణను పూర్తిచేయకపోవడం కారణం.

మీరు చేసిన తప్పులకు ఇతరులపై నెపం నెట్టకండి కేటీఆర్ అంటూ ట్వీట్ చేశాడు.

First published:

Tags: Hyderabad, KTR, Local News, Minister ktr

ఉత్తమ కథలు