హోమ్ /వార్తలు /తెలంగాణ /

Devotional: పద్మశాలి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు..శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో ఘనంగా చండీ యాగం

Devotional: పద్మశాలి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు..శ్రీ చౌడేశ్వరి మాత ఆలయంలో ఘనంగా చండీ యాగం

హైదరాబాద్ లోని కవాడివాడ పద్మశాలి కాలనీలోని శ్రీ చౌడేశ్వరి మాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. 1988లో అమ్మవారి ప్రతిష్టించగా..అప్పటి నుండి ఈ ఉత్సవాలను  అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  హైదరాబాద్ లోని కవాడివాడ పద్మశాలి కాలనీలోని శ్రీ చౌడేశ్వరి మాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. 1988లో అమ్మవారి ప్రతిష్టించగా..అప్పటి నుండి ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు శేషాద్రి పంతులు తెలిపారు. ఈ ఆలయం విశిష్టత గురించి శేషాద్రి పంతులు మాట్లాడుతూ..ఇక్కడి అమ్మవారు కాశీ నుండి విచ్చేసి స్వయంగా వెలిశారు. అందుకే ఈ ఆలయానికి అత్యంత కీర్తి,ప్రతిష్టలతో పేరుగాంచింది. అమ్మవారి ఉత్సవాల్లో  భాగంగా దసరా నవరాత్రులు, ఉగాది రోజు,  అమ్మవారి జయంతిని వైభవంగా జరుపుతున్నాం. నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పారాయణం, కుంకుమార్చన, అభిషేకం, సహస్త్ర నామం వంటి సేవలు జరపబడతాయి. అలాగే దుర్గాష్టమి సందర్బంగా పారాయణం తరువాత చండి యాగం జరపబడుతుంది. ఈ చండీ యాగాన్ని గత 35 సంవత్సరాలుగా  అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలతో తులతూగుతారని భక్తుల అపార నమ్మకం అని శేషాద్రి పంతులు పేర్కొన్నారు..

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు