Home /News /telangana /

HYDERABAD NAGARAJUNASAGAR ELECTION RESULT 2021 SAGAR BY ELECTIONS LIVE UPDATES VOTE COUNTING TELANAGANA TRS T CONGRESS JANAREDDY TRS CELEBRATING VICTORY AT STATE PARATY OFFICE VRY

Nagarjunasagar by Election Results 2021 Live: టీఆర్ఎస్‌కు పూర్తి మెజారిటి ..సంబరాల్లో పార్టీ శ్రేణులు

Nagarjunasagar assembly by election results 2021 live టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 14476 ఓట్ల 
మెజారిటి

Nagarjunasagar assembly by election results 2021 live టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 14476 ఓట్ల మెజారిటి

Assembly Election Results నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు 2021 Live: నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం దిశ‌గా దుసుకుపోతుండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఫలితాలపై మాట్లాడిన మంత్రి శ్రీనివాసయాదవ్ పూర్తి మెజారిటి 20 వేలకు పైగా సాధిస్తామని చెప్పారు.

ఇంకా చదవండి ...
    నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం దిశ‌గా దుసుకుపోతుండడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భ‌వ‌న్‌లో పార్టీ శ్రేణులు స్వీట్స్ పంచుకున్నారు. మరోవైపు డ‌ప్పులు వాయిస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఈ సంబరాల్లో మంత్రులు శ్రీనివాసయాదవ్‌తో పాటు శ్రీనివాస్ గౌడ్‌లు పాల్గోన్నారు. కాగా ఇప్పటివరకు మొత్తం 25 రౌండ్లకు గాను 19వ రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది..కాగా ఇప్పటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 14476  ఓట్ల మెజారిటితో ఉండగా మొత్తం 67573 ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 53097 ఓట్లు సాధించి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. కాగా ఇంకా ఏడు రౌండ్లు మిగిలి ఉండగా మరోగంటలో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి..మొత్తం ఓట్లు 220206 ఉండగా పోలైన ఓట్లు 189782 .

    ఇక ఫలితాలపై మాట్లాడిన మంత్రి శ్రీనివాసయాదవ్ పూర్తి మెజారిటి 20 వేలకు పైగా సాధిస్తామని చెప్పారు. మరోవైపు రేపు లెక్కించనున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఇదే ఒరవడి కొనసాగుతుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మొత్తం మీద దుబ్బాక ఎన్నికల తర్వాత అలర్ట్ అయిన టీఆర్ఎస్ అధినేత పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. దీంతో పార్టీ నేతలను అటు ఎమ్మెల్సి నుండి మున్సిపల్ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో సమీక్ష చేశారు. దీంతో టీఆర్ఎస్ అంచనా వేసినట్టుగానే ఫలితాలు వెలువడుతున్నాయి.. ఇక రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడ టీఆర్ఎస్ జెండా ఎగరవేయనుందని దీమాను వ్యక్తం చేస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Congress, Nagarjuna Sagar By-election, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు