హోమ్ /వార్తలు /తెలంగాణ /

IIT HYDERABAD: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మంచానికి ఉరివేసుకొని స్టూడెంట్ సూసైడ్ .. ల్యాప్‌టాప్‌లో ఏముందంటే..?

IIT HYDERABAD: ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మంచానికి ఉరివేసుకొని స్టూడెంట్ సూసైడ్ .. ల్యాప్‌టాప్‌లో ఏముందంటే..?

hyderabad iit student suicide

hyderabad iit student suicide

Student Death Mystery: వినాయకచవితి రోజున హైదరాబాద్‌ ఐఐటీ క్యాంపస్‌లో విషాదం నెలకొంది. ఎంటెక్ స్టూడెంట్ రూమ్‌లో తన మంచానికి ఉరివేసుకొని చనిపోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడు సూసైడ్ నోట్‌లో రాసినప్పటికి కారణాలు తెలియకపోవడం మిస్టరీగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

(K.Veeranna,News18,Medak)

వినాయకచవితి రోజున హైదరాబాద్‌(Hyderabad) ఐఐటీ క్యాంపస్‌(IIT Campus)లో విషాదం నెలకొంది. ఎంటెక్ స్టూడెంట్ (M.Tech student)రూమ్‌లో తన మంచానికి ఉరివేసుకొని చనిపోవడం కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకున్నట్లుగా మృతుడు సూసైడ్ నోట్‌(Suicide note)లో రాసినప్పటికి కారణాలు తెలియకపోవడం మిస్టరీగా మారింది. అయితే స్టూడెంట్ సూసైడ్ చేసుకున్న తీరు కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఎంటెక్ స్టూడెంట్ మృతికి సంబంధించిన డిటెయిల్స్, కారణాలు, డేటా అంతా అందులోనే భద్రంగా ఉండటంతో ...ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసే పనిలో ఉన్నారు ఫోరెన్సిక్(Forensic),ఐటీ నిపుణులు(IT experts).

Telangana : పెద్దపల్లి జిల్లాలోని రెండు పట్టణాల పేరు చెబితే హడలే .. క్రైంలో టాప్‌ ప్లేస్‌ వాళ్లదే



ఐఐటీ స్టూడెంట్ సూసైడ్..

సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో రాహుల్ బింగుమల్ల అనే 24సంవత్సరాల యువకుడు ఐఐటీ హైదరాబాదులోని ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం క్యాంపస్‌లోని తన రూమ్‌ నెంబర్‌ 107లో విగత జీవిగా కనిపించాడు. రాహుల్ తన రూమ్‌లోని మంచానికి ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపస్‌లోని మిగిలిన స్టూడెంట్స్‌ ఈవిషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కి చేరుకున్నారు. సూసైడ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పండుగ రోజు ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడంతో ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

ల్యాప్‌ టాప్‌లోనే సీక్రెట్ దాగుంది..

కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతానికి చెందిన రాహుల్ బింగుమల్ల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. రాహుల్ చనిపోయినట్లుగా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు పోలీసులు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడితే రాహుల్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు భావించారు. అయితే మృతి చెందిన విద్యార్థి రాహుల్ ల్యాప్‌టాప్‌లో తన సూసైడ్‌ చేసుకోవడానికి కారణాలు ఎంటర్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ ఉండటంతో దాన్ని ఓపెన్ చేయడానికి పోలీసులకు సాధ్యపడలేదు. తన చావుకు కారణాలను ల్యాప్‌టాప్‌లో ఎంటర్ చేసినట్లుగా ఓ సూసైడ్‌ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగనే ల్యాప్‌టాప్‌ని ఓపెన్ చేయడానికి ఐటీ నిపుణులు, ఫోరెన్సిక్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లుగా సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Extramarital Affair : డబ్బు కోసమే వివాహితతో సహజీవనం .. భర్తను వదిలొచ్చినందుకు చివరికి ఏమైందంటే..?



ఇప్పటి వరకు నలుగులు..

సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో ఐఐటీ హైదరాబాద్ 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధనలో ముందుకు దూసుకుపోతూ అన్నిటికీ దీటుగా నిలుస్తూ వస్తుంది. అయితే ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు ఇదే క్యాంపస్‌లో మొత్తం ఐదుగురు విద్యార్థులు వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అధిక ఒత్తిడితో ఒకరు, మానసిక రుగ్మతతో మరొకరు,తమకు పోటీగా వస్తున్నారనే బెంగతో ఇంకొకరు ప్రాణాలు తీసుకున్నారు. అయితే రీసెంట్‌గా సూసైడ్ చేసుకున్న రాహుల్ మృతిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఐఐటీలో సీటు సంపాదించాలంటే ఎంతో కష్టంగా ఉన్న ఈరోజుల్లో సీటు సంపాధించిన విద్యార్ధులు చిన్న చిన్న సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడుతుండడంతో ఇతర విద్యార్థులు వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళన నెలకొంది. విద్యార్థులకు మనో ధైర్యాన్ని కల్పించి విధంగా ..ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఐఐటీ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌ను విద్యార్దుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: IIT Hyderabad, Sangareddy, Telangana News

ఉత్తమ కథలు