హోమ్ /వార్తలు /తెలంగాణ /

Death Mystery : వర్షిత డెత్ కేసులో వీడని మిస్టరీ .. ఆటో డ్రైవర్ ఫోన్‌తో కాల్ చేసింది ఎవరికో..?

Death Mystery : వర్షిత డెత్ కేసులో వీడని మిస్టరీ .. ఆటో డ్రైవర్ ఫోన్‌తో కాల్ చేసింది ఎవరికో..?

(DEATH MYSTERY)

(DEATH MYSTERY)

Hyderabad | Death Mystery: ఎల్బీనగర్‌ మైనర్ బాలిక డెత్‌ కేసులో మిస్టరీ వీడటం లేదు. వర్షిత ఎవరి కోసం అపార్ట్‌మెంట్‌ దగ్గరకు వెళ్లింది. ఆటోలో వెళ్తూ డ్రైవర్‌ ఫోన్ నుంచి ఎవరికి కాల్ చేసిందనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సీసీ ఫుటేజ్ సేకరించారు. బాలిక తల్లిదండ్రులు, అపార్ట్‌మెంట్ వాసులను విచారిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌(Hyderabad)లో స్కూల్‌కి వెళ్లి చదువుకొని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత  మైనర్  బాలిక  పాల ప్యాకెట్ తీసుకొస్తానని తల్లికి చెప్పి ఆటోలో వెళ్లి వేరే చోట అపార్ట్‌మెంట్‌(Apartment)పై నుంచి దూకి చనిపోయింది. ఊహించని ఈ సంఘటన ఎల్బీనగర్‌(LB Nagar) పరిధిలో జరిగింది. అయితే బాలిక ఎందుకు చనిపోయింది..? కారణం ఏమిటనే విషయంపై మిస్టరీ(Mystery)వీడటం లేదు. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌(watchman)ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారిని విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్(CCTV footage)ఆధారంగా క్లూస్ సేకరిస్తున్నారు.

మైనర్‌ బాలిక డెత్‌ మిస్టరీ..

ఎల్బీనగర్‌ పరిధిలోని మధురానగర్‌కి చెందిన వర్షిత అనే మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మధురానగర్‌కి చెందిన సత్యనారాయణరెడ్డి రెండు కుమార్తె వర్షిత ప్రైవేట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతోంది. మంగళవారం స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత తల్లి దగ్గర డబ్బులు తీసుకొని షాపుకు వెళ్లి చిప్స్ కొనుక్కుంటానని చెప్పి వెళ్లింది. ఇంటి దగ్గర నుంచి బయల్దేరిన వర్షిత మన్సూరాబాద్ చౌరస్తా నుంచి ఆటోలో ఎల్బీనగర్ చంద్రపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్లింది. అక్కడి అపార్ట్‌మెంట్‌పైకి రూఫ్ టాప్‌పైకి కిందకు దూకింది. వర్షిత స్పాట్‌లో ప్రాణాలు విడిచింది. అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ విషయాన్ని పోలీసులకు చేరవడంతో స్పాట్‌కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ మొదలుపెట్టారు.

ఎవరికి ఫోన్ చేసిందో ..

చనిపోయిన వర్షిత ఆటోలో చంద్రపురి కాలనీకి వెళ్తుండగా ఆటో డ్రైవర్‌ ఫోన్‌ నుంచి గుర్తుతెలియని వ్యక్తికి కాల్‌ చేసినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆ క్లూ ఆదారంగా పోలీసులు అపార్ట్‌మెంట్ దగ్గరకు ఎందుకు వెళ్లింది...? ఆమెను ఎవరు రమ్మని పిలిచారు..? ఆటో డ్రైవర్ ఫోన్‌ నుంచి ఎవరికి కాల్ చేసిందనే విషయంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తున్నారు. వారిని విచారిస్తున్నారు. అపార్ట్‌మెంట్ దగ్గర సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ..ఆటో నెంబర్‌ ఆధారంగా కేసులో మిస్టరీని చేధించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Karimnagar: వర్షాలకు మేకలు తడుస్తున్నాయని.. మేకల కోసం రెయిన్​ కోట్స్.. నెట్టింట్ల వైరల్



అనేక అనుమానాలు..

బాలిక చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియపర్చిన పోలీసులు వర్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వర్షిత చంద్రపురి కాలనీకి వెళ్తుండగా ఆటో డ్రైవర్‌ ఫోన్‌ నుంచి ఎవరికి చేసిందో తెలిస్తే కేసులో మిస్టరీ వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు. అలాగే వర్షిత ఆ భవనంలోకే ఎందుకు వెళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన బాలిక ఆత్మహత్య చేసుకుందా లేక ప్రమాదవశాత్తు అపార్ట్‌మెంట్ రూఫ్‌ టాప్‌పై నుంచి పడిపోయిందా అనే విషయాలను తెలుసుకునేందుకు సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు.

First published:

Tags: Hyderabad, Minor girl, Telangana News