Home /News /telangana /

HYDERABAD MYSTERY BEHIND MARRIED WOMAN SUICIDE SNR

చనిపోయిన అమ్మ పిలిచిందని ప్రాణాలు తీసుకుంది..నిజంగా అలా ఎక్కడ జరిగిందో తెలుసా..!

hanging

hanging

suicide mystery:ఆమె బలవంతంగా ప్రాణం తీసుకుంది. ఎలాంటి కష్టలు లేవు. సంతాన సమస్యలు అంతకంటే లేవు. భర్త టార్చర్, మెట్టినింటి వేధింపులు..ఇలాంటివేవి కావు. మరి అలాంటప్పుడు ఆమె ఎందుకు ప్రాణం తీసుకుంది..! అదే ఎవరికి అర్ధం లేదు.

ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. ఎందుకో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రాణాలు తీసుకోవాల్సినంత కష్టం ఆమెకు ఏమాత్రం లేదు. భర్త బ్యాంక్ ఉద్యోగి. తాను ఓ ప్రైవేటు సంస్థలో మంచి జాబ్ చేస్తోంది. ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో షడన్‌గా ఆమె తీసుకున్న నిర్ణయంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. హైదరాబాద్ కొత్తపేట హుడా కాలనీకి చెందిన 39 సంవత్సరాల వైశాలీ అనే మహిళ ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ చూసి అందరూ షాక్‌కి గురయ్యారు. తన చావుకి ఎవరు బాధ్యులు కాదని.. మా అమ్మ రమ్మని పిలిచింది.. అందుకే పోతున్నానంటూ సూసైడ్ లెటర్‌లో స్పష్టంగా రాసింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలు వైశాలీ మనస్తాపం చెందడానికి కారణాలు ఏమిటని కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో కొంత విషయం రాబట్టగలిగారు పోలీసులు. వైశాలీకి 2005లో విశ్వనాథ్‌రాజుతో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఎలాంటి అరమరికలు లేకుండా వారి కాపురం సాఫీగా సాగింది. 16ఏళ్లు గడిచిన తర్వాత కుటుంబంలో జరిగిన చిన్న విషాద ఘటన ఆమెను తీవ్ర మానసీకక్షోభకు గురి చేసిందా లేక ఇంకా ఏమైనా కారణాలతో ఆమె చనిపోయిందా అన్న సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు.

మనోవేదన సూసైడ్‌కు దారి తీస్తుందా..
మృతురాలి సూసైడ్‌ లెటర్‌ను అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులు వైశాలీ మనోవేదనకు గురైనట్లుగా భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆమె తల్లి చనిపోయిందని..ఆ బాధ తట్టుకోలేకే ప్రాణాలు తీసుకొని ఉండవచ్చని పోలీసులకు తెలిపారు. వివాహిత సూసైడ్ విషయంలో పోలీసులు అసలు విషయం రాబట్టే పనిలో పడ్డారు. నిజంగా కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే జరిగి ఉంటుందా లేక ఏంకా ఏమైనా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో బలవన్మరణం చేసుకుందా అని ఆరా తీస్తున్నారు.

అతిగా ప్రేమించడం వల్ల అంత నష్టం జరుగుతుందా..
చనిపోయిన వ్యక్తుల ఆత్మలు నిజంగా వారి రక్తసంబంధీకుల చుట్టూ తిరుగుతాయని సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ వైశాలీ సూసైడ్‌ వెనుక కూడా అలాంటి ఆశ్చర్యకరమైన అంశమే ఉందని సూసైడ్‌ లెటర్‌ను బట్టి చూస్తే అర్ధమవుతోంది. ఈఘటన ద్వారా జీవితంలో హాయిగా స్థిరపడిన వ్యక్తులను మానసీక వేదన ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకునేలా ప్రేరేపిస్తుందా అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. అయితే బాగా అభిమానించే వ్యక్తులు దూరమైతే బాధ ఉండటం సహజం. కానీ బలవంతంగా ప్రాణాలు తీసుకునేంతగా వాళ్ల మానసీక పరిస్థితి దిగజారిపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి వైశాలీ సూసైడ్‌ కేసులో ఏం జరిగి ఉంటుందో తెలియాలి.
Published by:Siva Nanduri
First published:

Tags: Family suicide, Fraud women, Lady detective

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు