Home /News /telangana /

HYDERABAD MUSLIMS CELEBRATED THE MUHARRAM IN ALL PARTS OF TELANGANA SNR MBNR

Telangana : భక్తి,శ్రద్ధలతో మొహర్రం వేడుకలు ..పీర్లను ఊరేగించిన ముస్లింలు

(Muharram)

(Muharram)

Telangana: ముస్లింలు జరుపుకునే మొహర్రంకు ఓ ప్రత్యేకత ఉంది. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే కార్యక్రమం. మొహర్రం విషాదానికి సూచికగా జరుపుకునే రోజు తప్ప పర్వదినం కాదు. చాలా చోట్ల ఈ మొహర్రంను పీర్లపండుగ అంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Telangana, India
  (Syed Rafi, News18,Mahabubnagar)
  ముస్లిం(Muslims)లు జరుపుకునే మొహర్రంకు ఓ ప్రత్యేకత ఉంది. అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నిర్వహించుకునే పండుగ ఇది. మొహర్రంను జరుపుకోవడానికి కారణం ఏమిటంటే హసన్(Hassan), హుస్సేన్ (Hussain), అనే ముస్లిం వీరుల స్మారకార్థం శోక తప్త హృదయాలతో జరుపు కునే కార్యక్రమమే మొహర్రం(Muharram). ముస్లిం పంచాంగ రిత్యా అరేబియాArabiaలో సంవత్సరం మొదటి నెలలో ఫస్ట్ తేది నుంచి 10వ తేదీ వరకు జరుపుకుంటారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని పీర్లు అని పిలుస్తారు.'మొహర్రం అంటే పండుగ దినం కాదు.

  Telangana : 20ఏళ్లుగా ఆ గ్రామంలో యువకులు కనిపించడం లేదు ..16ఏళ్లు రాగానే అదే పనిలో ఉంటారు  మొహర్రం పండుగ కాదు..
  ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. ఇది అరబ్బీ కేలండర్ మొదటి నెల. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్‌ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ప్రాచీన కాలంలో అరబ్బులు ( అరేబియాలోని యూదులు, క్రైస్తవులతో సహా ) ఈ కేలండర్ ను వాడేవారు.ప్రాచీనకాలంలో ఆషూరా దినం. అంటే మొహర్రం పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ హల్బిదా, హల్బిదా అంటూ గుండెలు బాదుకొని రక్తం చిందించుకుంటారు. 1400 ఏళ్ల క్రితం హిజ్రీశకం 60 లో జరిగిన యదార్ధ ఘటనకు ప్రతి రూపం. మహనీయులు మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్యఖురానుగా గ్రంథస్తం చేశారు. ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అడుగు జాడల్లో విస్తరించింది.  అన్నీచోట్ల జరుపుకుంటారు..
  షియా ఇస్లాంలో ఈ మొహర్రం నెల, "ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా జరుపుకుంటారు. షియాలు నమాజ్‌లు చేస్తారు. తెలంగాణలో పలుచోట్ల ఈ మొహర్రం పండుగను పీర్ల పండుగ అనే పేరుతో జరుపుకుంటారు. హైదరాబాద్‌ పాతబస్తీలో షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు. బీబీకా అలావా నుంచి ప్రారంభమై ఈ ఊరేగింపు అలీజా కోట్ల, చార్మినార్‌, గుల్జార్‌ హౌస్‌, మీరాలం మండీ, దారుల్‌ షిఫాల మీదుగా కొనసాగి చాదర్‌ ఘాట్‌ వద్ద ముగుస్తుంది. శిక్షణ ఇచ్చిన ఏనుగుపై ఈ ఊరేగింపు సాగుతుంది.

  Telangana : ముందస్తు కోసం మనీ సిద్ధం .. ఇప్పటి నుంచే గ్రామల్లోకి తరలిపోతున్న నోట్ల కట్టలు  హిందూ ముస్లిం ఐక్యత..
  కొన్ని ప్రాంతాలలో ఇతర మతాల వారికి ముఖ్యంగా హిందువులకు కూడా పీర్ల పండగను పెద్ద పండుగగా భావిస్తారు. హిందూ మహమ్మదీయుల సామరస్యమే ఇందుకు కారణం. ముస్లింలలో దూదేకులా' వారు ఆటలమ్మ, మారెమ్మ దేవతలను కొలవటం తమ పిల్లలకు ఎఱ్ఱెప్ప, ఎల్లమ్మ, తిమ్మప్ప, బాలన్న అనే పేర్లు పెట్టుకోవటమూ అలాగే హిందువులలో కుల్లాయమ్మ, దస్తగిరి, నబీగౌడు, ఫక్కీరప్ప, మస్తాన్ రావు, లాలెమ్మ, సేకణ్ణ, సైదల్లీ, సైదులు, హుసేన్ దాసు అనే ముస్లిం పేర్లను పెట్టుకోవటం అలాగే ముస్లింలకు సంబంధించిన ఉరుసులలోనూ పరసలలోనూ పాల్గొనటం, దర్గాలకు, మసీదులకూ వెళ్ళటం, పీర్లను కొలవటం అనాదిగా వస్తోంది.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Muharram, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు