హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం.. ఈ ఆస్పత్రి ఎక్కడుందంటే..

Hyderabad: హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కార్పొరేట్ వైద్యం.. ఈ ఆస్పత్రి ఎక్కడుందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: రూపాయికే వైద్యంటే.. అదే చిన్న ఆస్పత్రి కాదు. కార్పొరేట్ స్థాయిలో నడుస్తోంది. ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 150 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదైనదిగా మారిపోయింది. మనలో చాలా మందికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ వసతులు ఉండవని... సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారనే ముద్ర పడిపోవడంతో.. సర్కార్ దవాఖాలకు వెళ్లరు. పోనీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుందామంటే.. ఆ ఖర్చులు భరించడం సామాన్య ప్రజలకు తలకు మించిన భారమవుతుంది. టెస్ట్‌లు, చికిత్సలు, మందుల కోసం.. వేలు, లక్షలు ఖర్చవుతుంటాయి. పెద్ద వ్యాధులేవైనా వస్తే.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి..! రోజుకు లక్ష రూపాయలకు వసూలు చేసే.. ఆస్పత్రులు కోకొల్లలుగా ఉన్నాయి. వైద్యాన్ని కూడా వ్యాపారంగా మార్చేసిన ఈ రోజుల్లో.. ఓ ఆస్పత్రి మాత్రం రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తోంది.

సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం.. రూపాయితో సాధ్యం అనే నినాదంతో మురుగన్ హాస్పిటల్ నడుస్తోంది. హైదరాబాద్‌ (Hyderabad) పంజాగుట్టలో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ సమీపంలో.. పిల్లర్ నెంబర్ A1122 వద్ద మురుగన్ ఆస్పత్రి(Murugan Hospitals) ఉంది. గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, ఆంకాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ సహా అనేక విభాగాల్లో ఇక్కడ వైద్య సేవలను అందిస్తున్నారు. ఇక్కడ ఏ డాక్టర్‌ని కలవాలన్నా.. కన్సల్టెన్సీ ఫీజు రూపాయే ఉంటుంది. అంతకు మించి ఒక్క పైస కూడా ఎక్కువగా తీసుకోరు. ల్యాబ్ టెస్ట్‌లు కూడా ఇతర ఆస్పత్రులతో పోల్చితే.. తక్కువ ధరకే చేస్తారు. 25శాతం డిస్కౌంట్ ఉంటుంది. మందులను కూడా 10శాతం తక్కువ ధరకే అందజేస్తున్నారు.

Weather Updates: మరో మూడు రోజుల పాటు చలి... ఆ తర్వాత ఎండలే ఎండలు

రూపాయికే వైద్యంటే.. అదే చిన్న ఆస్పత్రి కాదు. కార్పొరేట్ స్థాయిలో నడుస్తోంది. ఇక్కడ అత్యాధునిక వైద్య సదుపాయాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. 150 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. నిత్యం వందల మంది ఇక్కడి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాదు.. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉచితంగా అంబులెన్స్‌ సేవలను అందిస్తున్నారు. నగరంలో ఉచితంగా వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి జిల్లా కేంద్రంలోనూ మురుగన్ ఆస్పత్రిని స్థాపించి.. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు.

క్రిష్ణ అనే ఆర్ఎంపీ డాక్టర్ కుమారుడు బాలచందర్.. ఈ మురుగున్ ఆస్పత్రిని స్థాపించారు. వీళ్ల పూర్వీకులు కూడా తక్కువ ధరకే వైద్యం చేశారని.. వారి స్ఫూర్తితోనే రూపాయికే కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. రూపాయికి ఏమీ రానీ ఈ రోజుల్లో.. కార్పొరేట్ వైద్యం అందిస్తున్న మురుగన్ ఆస్పత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

First published:

Tags: Hyderabad, Local News, Medical Treatment, Telangana

ఉత్తమ కథలు