Home /News /telangana /

HYDERABAD MURDERED FOR HAVING AN EXTRAMARITAL AFFAIR WITH HIS WIFE IN HYDERABAD VB

Hyderabad Crime: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. అత్యంత దారుణంగా..

శ్రీకాంత్ (ఫైల్ ఫొటో)

శ్రీకాంత్ (ఫైల్ ఫొటో)

Hyderabad Crime: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ యువకుడిని హత్య చేసి చెట్ల పొదల్లో పడేశారు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    వివాహేతర సంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అనే తేడా లేదు. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్కచూపులు. అదొక్కటే కారణం అని చెప్పలేము. డబ్బులకు ఆశ పడి.. వ్యామోహంతో ఇలా వాళ్ల చూపులు పక్కదారి పడుతున్నాయి. దీంతో వాళ్లను నమ్ముకొని ఉన్న కుటుంబసభ్యులను కష్టాల్లో నెడుతున్నారు. తాజా ఘటనలో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఓ యువకుడిని హత్య చేసి చెట్ల పొదల్లో పడేశారు. ఈ ఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు స్థానికి సీఐ నర్సింగ్‌రావు వివరాల ఇలా తెలిపారు.

    Sexual Harassment: అక్క కోసం వెళ్లాడు.. చెల్లితో అతడు ఏం పని చేశాడో చూడండి..


    కూకట్‌పల్లి కైత్లాపూర్‌లో ఉంటున్న శ్రీకాంత్‌ (25), శ్రీశైలం సమీప బంధువులు. వీరు ఇరువురు పాల వ్యాపారం చేసేవారు. కొన్ని రోజుల క్రితం నుంచి శ్రీకాంత్ కనిపించడం లేదు. శ్రీశైలంను ఆచూకీ అడగ్గా తనకు ఏం తెలియదు అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో సంచలన విషయాలను భయటకు వచ్చాయి. హత్యకు ఒకరోజు ముందు శ్రీశైలం, శ్రీకాంత్‌ ఇద్దరూ కైత్లాపూర్‌లో టీ తాగిన అనంతరం నడుచుకుంటూ వైన్‌ షాపు సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లారు. అక్కడ నుంచి ఒక్కడే బయటకు వచ్చాడు.

    Sexual Harassment : నోరులేని జీవాలను వదలని మానవ మృగాళ్లు.. ఆడకుక్కను అతడు ఏం చేశాడో చూడండి..


    విషయం తెలుసకున్న పోలీసులు శ్రీశైలంను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో వివచారించగా.. వివరాలు ఇలా చెప్పాడు. తన భార్యతో శ్రీకాంత్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందుకే అతడిని ఎలాగైనా మట్టుపెట్టాలన్న ఉద్దేశంతో చెట్లపొదల్లోకి తీసుకెళ్లినట్లు తెలిపాడు. ఆ సమయంలో శ్రీశైలం.. శ్రీకాంత్‌ని రాడ్‌తో తలపై మోదాడు. అప్పటికి శ్రీకాంత్‌ ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుండటంతో మరోసారి దాడి చేసి హత్య చేశాడు.

    So Sad: ఈ ఘటన వింటే నిజంగా మానవత్వం బతికే ఉంది అనిపిస్తుంది.. అమ్మ కోసం ఆ కూతురు చేసిన త్యాగం..


    అనంతరం మృతదేహాన్ని చెట్ల పొదల్లోని ఓ గుంతలో పడేవేసి వెళ్లిపోయాడు. దీంతో నిందితుడిని హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కుటుంబసభ్యులు కూడా శ్రీశైలంపైనే అనుమానం వ్యక్తం చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime news, Greater hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు