తెలంగాణలోని మిని మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం ఏడు గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించారు. దీంతో ఫలితాలు వెలువడె సరికి సాయంత్రం అయ్యె అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా రాష్ట్రంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పోషన్ తోపాటు సిద్దిపేట, నకేరేకల్, అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, నిర్వహించగా, గజ్వేల్, నల్లగొండ,బోధన్ , పరకాలతో మున్సిపాలిటీల్లో ఓక్కోవార్డుకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఇక వరంగల్ కార్పోషన్లో మొత్తం 66 డివిజన్లు ఉండగా ..కొత్తూరు మున్సిపాలిటికి అతి తక్కువగా 23 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి.
కరోనా నేపథ్యంలో ఎన్నికల ఫలితాల ఏర్పాట్లకు సంభంధించి ముందస్తు చర్యలు తీసుకున్నారు.రాష్ట్రంలోని మిని పోల్స్ ప్రక్రియను మొత్తం 15 రోజుల్లోనే ముగించారు. దీంతో ఎప్రిల్ ముప్పైన ఎన్నికలను నిర్వహించగా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలను ఈసీ నిషేధించింది. ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గోనే వారికి కరోనా పరీక్షలు చేసిన అనంతరమే కౌంటింగ్ ప్రక్రియకు అనుమతించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.