• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD MP SNTHOSH KUMAR TESTED CORONA POSITIVE BUT NA HAVE SYMPTOMS AT PRESENT VS

corona positive : ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్

corona positive : ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటివ్

కేసీఆర్ బొమ్మ ఉన్న మాస్క్‌తో ఎంపీ సంతోష్

corona positive : రాష్ట్ర్రంలో మరో ప్రజాప్రతినిధికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది. తాజాగా ఎంపీ సంతోష్ కుమార్‌కు కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన తన ట్విట్టర్ ద్వార తెలిపారు.

  • Share this:
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ప్రస్తుతం కరోనా లక్షణాలు ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నట్టు తెలిపారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసి తన ఆరోగ్యం పట్ల ఎంతో మంది అభిమానులు, పార్టీనాయకులు తనకు ఫోన్‌లు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నానని, ఎవరూ ఆందోళన పడాల్సిన పనిలేదని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాలని, అత్యసవరమైతేనే బయలకు వెళ్లాలని కోరారు. కాగా నిత్యం సీఎం కేసిఆర్ వెంటే ఉండే సంతోష్ కుమార్ గత రాత్రి కూడ సీఎం కేసిఆర్‌కు కరోనా సోకిన నేపథ్యంలోనే రాత్రి యశోద ఆసుపత్రికిలో చికిత్స కోసం వచ్చారు..ఈ సంధర్భంలో సంతోష్ కుమార్ పక్కనే ఉన్నారు. కాగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలకు సైతం రాష్ట్రంలో కరోనా సోకిన విషయం తెలిసిందే..
Published by:yveerash yveerash
First published: