RRR: ఎంపీ రఘురామకు ఏమైంది... కాలు కింద పెట్టకూడదంటుున్న ఎయిమ్స్‌ వైద్యులు

ఎంపీ రఘురామకు ఏమైంది..?

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏమైంది.. ఆ రోజు కష్టడీలో ఏం జరిగింది..? నిజంగానే పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారా..? ఏపీ ప్రభుత్వం వైద్యులు ఇచ్చిన రిపోర్టులో అసలు దెబ్బలే లేవన్నారు. మొన్న ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికలో కాలికి గాయమైందని నిర్ధారించారు. ఇఫ్పుడు ఎయిమ్స్ వైద్యులు అయితే ఆయన ఇప్పట్లో కాలు కింద పెట్టకూడదు అంటున్నారు..

  • Share this:
    వైసీపీ రెబల్ ఎంపీకి ఏమైంది..? ఏపీ సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్న రోజు ఏం జరిగింది. ఎంపీ రఘురమాకృష్ణరాజు, ఆయన న్యాయవాదులు, కుటుంబ సభ్యులు మాత్రం.. పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. దీనిపై మొదట హైకోర్టులో విచారణ సందర్భంగా.. ప్రభుత్వ వైద్యుల కమిటీతో నివేదిక కోరింది. ఆ నివేదికలో మాత్రం ఎలాంటి గాయాలు లేవని.. తాజాగా తగిలిన దెబ్బలు ఏవీ కనిపించలేదని నివేదిక ఇచ్చారు. అయితే దీంతో రఘురామ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కాదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరుతులు పెట్టింది.

    బెయిల్ ఇవ్వానికి ప్రధాన కారణం ఆర్మీ ఆస్పత్రి ఇచ్చిన నివేదికే అంటున్నారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఆయన కాలికి గాయాలు అయ్యాయని కోర్టు నిర్ధారణకు వచ్చిందని.. ఆర్మీ వైద్యాధికారులు కూడా అదే అంశాన్ని నివేదికలో ఇచ్చారని అంటున్నారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికను న్యాయమూర్తి వినయ్ చరణ్‌ చదివి వినిపించారు. రఘురామ పాదాలకి గాయాలున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు..

    ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... ఇకపై బస్సుల్లో కరోనా చికిత్స

    ఇటీవల ఆయన ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వెంటనే అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లి ఎయిమ్స్ లో జాయిన్ అయ్యారు. అక్కడ ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు చేశారు. రఘురామకు సిటీస్కాన్‌, ఎమ్మారై స్కాన్‌తో పాటు పలు రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన పాదాల్లో సెల్‌ డ్యామేజ్‌ ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయన రెండు కాళ్లకు వైద్యులు పీవోపీ కట్టు కట్టారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని రఘురామకు సూచించారు.

    ఇదీ చదవండి: కార్యనిర్వాహక రాజధాని దిశగా అడుగులు.. విశాఖ ఎయిర్ పోర్టుకు కొత్త హంగులు

    రఘురామ ఎట్టి పరిస్థితుల్లో నడవడానికి వీల్లేదని ఎయిమ్స్‌ వైద్యులు చెప్పారు. పరీక్షల తరువాత ఎయిమ్స్‌ నుంచి అధికారిక నివాసానికి రఘురామకృష్ణరాజు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రఘురామ, సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కాలి గాయాలు తగ్గకపోవడం, నొప్పి ఎక్కువగా ఉండడం, బీపీ నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన బుధవారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తాజా ఎయిమ్స్ నివేదికతో ఆ రోజు ఏం జరిగిందో అందరికీ అర్ధమవుతోంది అంటున్నారు రఘురామ కుటుంబ సభ్యులు.. పోలీసులు చిత్ర హింసలకు గురి చేయకపోతే ఇంత పెద్ద గాయాలు ఎలా జరుగుతాయని ప్రశ్నిస్తున్నారు. ఎంపీ రఘురామ రాజు చెప్పినట్టు కొందరు పోలీసులు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఆయన్ను చిత్రహింసలకు గురించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: