హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఒక ఉప ఎన్నిక కోసం ఇంతలా బరితెగించాలా? : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Hyderabad: ఒక ఉప ఎన్నిక కోసం ఇంతలా బరితెగించాలా? : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Asaduddin owaisi

Asaduddin owaisi

భారతీయ జనతా పార్టీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ ఒక ఉపఎన్నిక కోసం ఇంతలా బరితెగించాలా అని ప్రశ్నించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  భారతీయ జనతా పార్టీ (BJP)పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ  (MP Asaduddin Owaisi) తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ ఒక ఉపఎన్నిక కోసం ఇంతలా బరితెగించాలా అని ప్రశ్నించారు. ఇప్పుడే బీజేపీ తీరు ఇలా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అగ్నికి ఆహుతి చేద్దామనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్లకు నిప్పు పెట్టి, దుకాణాలు, పాఠశాలలు మూయించి ప్రజలను ఇళ్లలోంచి రాకుండా కర్ఫ్యూ సృష్టించాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అల్లా దయతో ఇవన్ని జరగకూడదని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
  అంతకముందు అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి ఎంఐఎం లేఖ రాసింది. రాజాసింగ్‌ (MLA Raja Singh) ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని పేర్కొంది. సెక్షన్‌ 41 సీఆర్‌పీసీ (CRPC) కింద నోటిస్‌ ఇవ్వలేదనే కారణంతోనే రాజాసింగ్‌కు బెయిల్‌ ఇచ్చారని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. చట్టప్రకారం మరోసారి రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


  హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే రాజాసింగ్‌ వీడియో విడుదల చేశారని అసదుద్దీన్‌ మండిపడ్డారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాజాసింగ్‌ను అరెస్ట్‌ చేసి వీడియో శాంపిల్‌ తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.


  Raja singh: BJP ఎమ్మెల్యే రాజాసింగ్​ చుట్టు ఉచ్చు బిగిస్తున్న తెలంగాణ ప్రభుత్వం!


  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను( MLA Rajasingh)పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మూడ్రోజుల క్రితమే అరెస్టై బెయిల్‌పై విడుదలైన రాజాసింగ్‌ని మంగళ్‌హాట్‌ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ఇంటికి వెళ్లిన పోలీసులు పాత కేసుల విషయంలో 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. కొద్ది సేపటి క్రితమే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఓల్డ్ సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఆయన్ని అత్యంత గోప్యంగా ఉండే ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా సమాచారం.


  రెండో సారి .. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను మంగళ్‌హాట్‌కి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో రెండ్రోజుల క్రితమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అటుపై నాంపల్లి(Nampally Court) కోర్టులో ప్రవేశపెట్టారు. 14వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాజాసింగ్‌కు 14రోజుల రిమాండ్‌ విధించింది. అయితే ఆ తర్వాత రాజాసింగ్‌ తరపు లాయర్ బెయిల్‌ పిటిషన్ (Bail Petition)దాఖలు చేశారు. ఎమ్మెల్యే బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో వాదనలు జరిగాయి. అయితే సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 41సీఆర్‌పీసీ(CRPC) పాటించకుండా ఎలా రిమాండ్‌ చేస్తారని న్యాయవాది కోరారు. పోలీసుల తరపు న్యాయవాది పాత కేసులను పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టు కోరడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Asaduddin Owaisi, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు