హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై కదులుతున్న కారులో మంటలు.. ఉలిక్కిపడ్డ వాహనదారులు

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై కదులుతున్న కారులో మంటలు.. ఉలిక్కిపడ్డ వాహనదారులు

ట్యాంక్‌బండ్‌పై కదులుతున్న కారులో మంటలు..

ట్యాంక్‌బండ్‌పై కదులుతున్న కారులో మంటలు..

ట్యాంక్‌బండ్‌పై వెళ్తున్న ఓ కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ మార్గంలో వెళ్తున్నవారు.. కారులోని ప్రయాణిస్తున్నవారిని అప్రమత్తం చేశారు.

  హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్తున్న ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనతో ఆ మార్గంలో వెళ్తున్నవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ట్యాంక్‌బండ్ బోట్స్ క్లబ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగి విజయ్‌కుమార్ శుక్రవారం కారులో సెక్రటేరియట్ సమీపంలోని ఓ బ్యాంక్‌కు పనిమీద వెళ్లారు. విజయ్‌కుమార్‌తో పాటు అతని భార్య చంద్రకళ కూడా ఉన్నారు. బ్యాంక్ పని ముగించుకున్న తర్వాత విజయకుమార్ భార్యతో కలిసి తన ఇంటికి బయలుదేరాడు. ఆ సమయంలో కారు వెనక భాగంలో మంటలు రావడం ప్రారంభమైంది.

  ఇతర వాహనదారులు ఆ కారులో ప్రయాణిస్తున్నవారికి విషయాన్ని తెలియజేశారు. దీంతో విజయ్‌కుమార్, చంద్రకళ దంపతులు కారును నిలిపివేసి కిందకు దిగారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో దగ్దమైంది. సకాలంలో వారు కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఇంజన్‌లో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

  రోడ్డుపై కారు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలను చూసి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, పాదచారులు ఉలిక్కపడ్డారు. అయితే కారుకు మంటలు అంటుకున్న సమయంలో ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసిన సకాలంలో స్పందించలేదని విజయ్‌ కుమార్ తెలిపారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Fire Accident, Hyderabad

  ఉత్తమ కథలు