రోడ్డు ప్రమాదాలు ఆ సమయాల్లోనే ఎక్కువ.. ఆసక్తికర అధ్యయనం..

ఏప్రిల్ 2016-సెప్టెంబర్ 2016 మధ్య రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని రీసెర్చ్ పేపర్ తయారుచేశారు. అయితే ఇందులో పరిగణలోకి తీసుకున్నవన్నీ ప్రాణాంతకం కానీ ప్రమాదాలు మాత్రమే.

news18-telugu
Updated: December 14, 2019, 3:53 PM IST
రోడ్డు ప్రమాదాలు ఆ సమయాల్లోనే ఎక్కువ.. ఆసక్తికర అధ్యయనం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నగరానికి చెందిన ఓ ఫోరెన్సిక్ సైంటిస్ట్ రీసెర్చ్ పేపర్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. చాలావరకు రోడ్డు ప్రమాదాలు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్యలో జరుగుతున్నాయని అందులో పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం కోసం మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(MRIMS)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ డా.టి.విక్రమాదిత్య కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం ప్రాంతంలో జరిగిన ప్రమాదాలను పరిగణలోకి తీసుకున్నారు. ఏప్రిల్ 2016-సెప్టెంబర్ 2016 మధ్య రోడ్డు ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని రీసెర్చ్ పేపర్ తయారుచేశారు. అయితే ఇందులో పరిగణలోకి తీసుకున్నవన్నీ ప్రాణాంతకం కానీ ప్రమాదాలు మాత్రమే.

దాదాపు 84 ప్రమాదాల్లో భాదితులను మల్లారెడ్డి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకువచ్చారు. ఇందులో సగానికి ఎక్కువమంది(52.96శాతం) 15-30 ఏళ్ల మధ్యవారేనని అధ్యయనంలో తేలింది. దాదాపు 52.38శాతం మంది రోడ్డు ప్రమాద బాధితులు బైక్ యాక్సిడెంట్‌కి గురైనవారే. 25శాతం రోడ్డు ప్రమాద బాధితులు ఫోర్ వీలర్,11.90శాతం మంది త్రీ వీలర్,7.14శాతం బస్సు ప్రమాదాలకు గురైనవారు. మరో 3.57శాతం మంది లారీ,మినీ లారీ ప్రమాదాలకు గురైనవారు. కేవలం 8.33శాతం ప్రమాదాలు మాత్రమే మద్యం ప్రభావం వల్ల జరుగుతున్నట్టు తేలింది.ప్రమాదాలకు గురవుతున్నవారిలో ఎక్కువమంది మగవారే ఉన్నట్టే తేలింది.

ఇక చాలా ప్రమాదాలు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల మధ్యలో జరుగుతున్నట్టు తేలింది. అయితే మిగత ప్రాంతాల్లోనూ ఇదే సమయాల్లో యాక్సిడెంట్స్ జరుగుతాయని చెప్పడానికి లేదన్నారు. అక్కడి రోడ్లు,ఉద్యోగులు వంటి వాటిపై అది ఆధారపడి ఉంటుందన్నారు.సూరారం ప్రాంతం పారిశ్రామికవాడకు సమీపంలో ఉంటుందని, ఆ ప్రాంతంలో హైవేలను ఆనుకుని చాలా కాలేజీలు ఉన్నాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6గంటల సమయంలో ఉద్యోగులు,విద్యార్థులు ఇంటి బాట పడుతారని.. బహుశా అందుకే ఆ సమయంలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>