తెలుగు రాష్ట్రాలు గర్వపడేలా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునేలా చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. కీరవాణి.. ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌కు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఎం ఎం కీరవాణి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కీరవాణి స్వయంగా వెల్లడించడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు అనే పాటకు ఆస్కార్ అందుకున్నాక ఆయనకు కోవిడ్ సోకింది.
ఆస్కార్ అవార్డుల విషయంలో ఇండియా నుండి అమెరికాకు అలాగే అక్కడ పలుచోట్ల పలు ప్రాంతాల్లో తిరిగారు.. వేలాదిమందిని కలిశారు. అలాగే ఆస్కార్ ను అందుకొని ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా వందలాది మందిని కలిశారు. ఇక ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ ముగించుకొని ఈ మధ్యనే త్రిబుల్ ఆర్ మూవీ యూనిట్ మొత్తం ఇండియాకి చేరుకుంది. అయితే తాజాగా ఎం ఎం కీరవాణి హాస్పిటల్ బెడ్ పైపడుకున్న ఫొటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
కీరవాణికి ఒంట్లో నలతగా ఉంటే కోవిడ్ – 19 టెస్ట్ చేయించుకున్నాడు. ఆ టెస్ట్ లో పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని వెల్లడించారు కీరవాణి. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో కీరవాణిని కలిసిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకునే పనిలో పడ్డారు. అటు త్రిబుల్ ఆర్ఆర్ఆర్ టీం కూడా కాస్త ఆందోళనకు గురవుతుంది. రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి కూడా కీరవాణి వెంట విదేశాలకు వెళ్లారు. దీంతో వారిలో కూడా ఆందోళన మొదలయ్యింది.
ఇక నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడం కోసం ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఇక చివరి వరకు ఆస్కార్ తమకు ఎలాగైనా వస్తుంది అనే గట్టి నమ్మకం మాత్రం ఉంది. ఇక వాళ్ళు అనుకున్నట్టే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. ఇక ఆస్కార్ అవార్డు వేదికపై కీరవాణి అలాగే చంద్రబోస్ గారు ఇద్దరు ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona positive, Covid, Hyderabad, Local News, Tollywood