Hyderabad: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సత్యవతి సహా పలువురు నాయకులు హైదరాబాద్ కు పయనమయ్యారు. కాగా ఇవాళ్టి కవిత విచారణలో హైడ్రామా నెలకొంది. అప్పటివరకు ఈడీ విచారణకు హాజరవుతారనుకున్న కవిత సడన్ గా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల విచారణకు రాలేనని మరో తేదీన విచారణ జరపాలని ఈడీకి కవిత సమాచారం అందించారు. ఈ క్రమంలో ఈనెల 20న విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చారు. దీనితో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవితతో సైతం హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.
కాగా ఈనెల 11న కూడా కవితను ఈడీ అధికారులు విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. అయితే అదే రోజు కవితను అరెస్ట్ చేయబోతున్నారని పెద్ద జరిగింది. దీనితో హుటాహుటీన కేటీఆర్ , హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే ఆరోజు కేవలం కవితను విచారించిన అధికారులు మరోసారి 16న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. దీనితో మంత్రులు కవితతో కలిసి హైదరాబాద్ కు వచ్చారు. ఇక ఇవాళ నెలకొన్న హైడ్రామాతో విచారణకు కవిత హాజరు కాలేదు. మరి 20న కవిత ఈడి విచారణకు హాజరు అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణపై ఉత్కంఠ వీడింది. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కవిత..అనారోగ్య కారణాల వల్ల ఈరోజు హాజరు కాలేనని..మరో రోజు హాజరు అవుతానని తన ప్రతినిధితో ఈడీకి లేఖను పంపింది. ఈ లేఖను పరిశీలించిన ఈడీ అధికారులు ఆమె విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో కవిత (MLC Kavitha)కు మరోసారి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని అధికారులు ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈనెల 11న కవిత (MLC Kavitha) ను విచారించిన ఈడీ అధికారులు 16న మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్య కారణాల వల్ల రాలేనని కవిత ఈడీకి లేఖ రాసిన నేపథ్యంలో మరో తేదీన విచారణకు రావాలని ఈడీ తాజాగా నోటీసులు ఇచ్చింది.
దీనితో కవిత ఈడీ విచారణపై సస్పెన్స్ వీడింది. మరి ఈడీ నోటిసులపై కవిత ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Harish Rao, Hyderabad, Kalvakuntla Kavitha, KTR, Telangana