హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..ఆ విషయంలో ధన్యవాదాలు చెబుతూ ట్వీట్

Telangana: గవర్నర్ తమిళిసైకి ఎమ్మెల్సీ కవిత కౌంటర్..ఆ విషయంలో ధన్యవాదాలు చెబుతూ ట్వీట్

గవర్నర్ కు కేసీఆర్ కూతురు కౌంటర్

గవర్నర్ కు కేసీఆర్ కూతురు కౌంటర్

రిపబ్లిక్ డే వేడుకలు వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నేడు రాజభవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ అధికారులు మినహా మంత్రులు కానీ ఇతర నాయకులు ఎవరూ కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సర్కార్ పై పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే గుత్తా సుఖేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ పై విమర్శలు గుప్పించగా..తాజాగా కల్వకుంట్ల కవిత ట్వీట్ తో తమిళిసైకి కౌంటర్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రిపబ్లిక్ డే వేడుకలు వేదికగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. నేడు రాజభవన్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ అధికారులు మినహా మంత్రులు కానీ ఇతర నాయకులు ఎవరూ కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సర్కార్ పై పరోక్షంగా ఆమె చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే గుత్తా సుఖేందర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గవర్నర్ పై విమర్శలు గుప్పించగా..తాజాగా కల్వకుంట్ల కవిత ట్వీట్ తో తమిళిసైకి కౌంటర్ ఇచ్చారు.

Hyderabad: రాజ్యాంగ అమలు రోజున రాజకీయాలా? గవర్నర్‌పై మంత్రి తలసాని ఆగ్రహం

'కరోనా లాంటి కష్ట సమయంలో సెంట్రల్ విస్టా కంటే దేశ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని బీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిందన్నారు. కేవలం కొందరి సంపద కోసమే కాకుండా యువత, రైతులు, కూలీలను పట్టించుకోవడం కోసమే తాము పోరాడుతున్నట్టు కవిత తెలిపారు. అయితే ఇలాంటి ప్రత్యేకమైన రోజు సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు అంటూ కవిత ట్వీట్ చేశారు.

Hyderabad: బ్యాడ్మింటన్ లో దుమ్మురేపుతున్న బామ్మలు..ఆట చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

గవర్నర్ ఏమన్నారంటే?

'' ఆరు దశాబ్ధాల పాటు ప్రజల పోరాటంతో రాష్ట్రం వచ్చింది. ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు.  రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అవతరించింది.  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకారం అందిస్తోంది.  బాలికలు, మహిళల్లో ఎనీమియా నివారణ కోసం చర్యలు చేపట్టాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లను నిర్వహించాం. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదు. జాతిని నిర్మాణమే నిజమైన అభివృద్ధి. రైతులకు పొలాలు, ఇళ్లు ఉండాలి. ఫామ్ హౌజ్‌లు కాదు. అది అభివృద్ధి కాదు.  అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలి.  ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు మన యూనివర్సిటీల్లో ఉండడమే నిజమైన అభివృద్ధి అంతేతప్ప. మన పిల్లలు మాత్రమే విదేశాల్లో చదువుకోవాలనేది నిజమైన అభివృద్ధి కాదు.

మనదేశంలో 60శాతం మంది యువతే ఉన్నారు. మనది యంగ్ ఇండియా. తెలంగాణలో సగటున రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి.రాయిలా నిలబడాలి. దేనినైనా ఎదుర్కొనాలి.  ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నిలబెడుతుంది.  జీ20 కాన్ఫరెన్స్‌లో  యువత పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడదాం..  తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందాం.''  అని తమిళిసై సౌందరరాజన్ అన్నారు.  గవర్నర్ వ్యాఖ్యలతో కవిత ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది.

First published:

Tags: Governor Tamilisai Soundararajan, Kalvakuntla Kavitha, Kcr, Telangana

ఉత్తమ కథలు