Tatikonda Rajaiah : సీఎం కేసీఆర్ పెద్ద కొడుకు అత్త,మామా, చివరికి భ...ర్తలా కూడా..?

ఎమ్మెల్యే టీ.రాజయ్య

Tatikonda Rajaiah : సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తడంలో.. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫ్లోలో మాట జారాడు.. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

  • Share this:
    బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.. ముఖ్యంగా సీఎం కేసీఆర్ మహిళల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలతో ముఖ్యంగా వృద్యాప్య పెన్షన్‌ను ఇస్తున్న సీఎం కేసీఆర్‌ను (cm kcr ) వారికి పెద్ద కొడుకుగా .. అన్నగా తమ్ముడిగా మారడని ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తుంటారు. ఈ క్రమంలోనే తమ పార్టీని, అధినేతను ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఆకాశానికి ఎత్తడం అధికార పార్టీ నేతలకు అవసరం .. అయితే ఆ అవసరం కాస్తా.. అలవాటుగా కూడా మారింది. ఇప్పుడు ఆ.. అలవాటే ఎమ్మెల్యే రాజయ్యకు చిక్కులు తెచ్చిపెట్టింది. తన మనుస్సులో ఉన్న మాటను ఆయన అనుకోకుండానే బయటపెట్టాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

    ఇంతకి విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపీణి చేస్తున్న నేపథ్యంలోనే ఘన్‌పూర్ (Ghanpur )నియోజకవర్గంలోని మహిళలకు ఆ చీరల పంపీణి ( Batukamma sarees )కార్యక్రమాన్ని నేడు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న రాజయ్యా ఇలా మాట్లాడారు. మహిళల కోసం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు చివరకు ఒక మగవాడు తీర్చే అన్ని సౌకర్యాలను సీఎం కేసీఆర్ తీరుస్తున్నాడని, అంటే గర్భిణి (pregnanat )సమయంలో వారికి ఇస్తున్న డబ్బులతో పాటు పిల్లలకు కావాల్సిన వస్తువులను కేసీఆర్ కిట్ (kcr kit )రూపంలో అందిస్తున్నారని ...దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాజయ్య ఇలా అత్త,మామా, భర్త చేసే అన్ని పనులను కూడా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. కాని వారికి వాటిని అత్తమామలు లేద భర్త కూడా అందించడం లేదని చెప్పాడు.. ఇక ఈ ఫ్లోలోనే "సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని మహిళలకు అన్నగా ,అత్త,మామలతో పాటు చివరకు భ...ర్తగా "కూడా అంటూ సర్ధుకున్నాడు..

     ఇది చదవండి : ఢిల్లీ స్కూల్లో దారుణం.. తల్లిని తిట్టాడని తోటి విద్యార్థిని కత్తితో ఇలా చేశాడు... !


    ఈ సమయంలోనే ఆ వీడియోలో ఉన్న ఓ మహిళ సైతం రాజయ్య మాట్లాడుతున్నప్పుడు తలను కిందికి దించుకోవడం కనిపించింది. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో( social media ) చక్కర్లు కొడుతోంది. దీంతో ఎమ్మెల్యే స్థాయిలో ఇలా మాట్లాడడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
    Published by:yveerash yveerash
    First published: