HYDERABAD MLA SON BOOKED IN HYDERABAD JUBILEE HILLS GANG RAPE CASE SAYS CP CV ANAND AK
Hyderabad Gang Rape: గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం.. ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుపై కేసు నమోదు
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad Case Updates: ఈ కేసులో ఎక్కువగా మైనర్లు ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని అన్నారు.
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఎక్కువగా మైనర్లు ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad Police Comissioner CV Anand) తెలిపారు. ఆరుగురు నిందితుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని అన్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా ఎంఐఎం(AIMIM) ఎమ్మెల్యే కుమారుడుని కూడా నిందితుల జాబితాలో చేర్చింది. నలుగురు వ్యక్తులో కారులో తనపై అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఎమ్మెల్యే కొడుకు కూడా ఉన్నాడంటూ ప్రచారంలో ఫోటోలు వచ్చాయి.
ఫోటోలు చూపించి బాధితురాలి(Victim) స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఇద్దరు మేజర్లు ఉన్నారు. ఘటనలో ఎమ్మెల్యే కుమారుడు పాత్ర కూడా ఉందని ఆధారాలు లభించడంతో పోలీసులు నిందితుల జాబితాలో ఎమ్మెల్యే కొడుకు పేరును చేర్చినట్టు తెలుస్తోంది.
మే 28 బాధితురాలిపై అత్యాచారం జరిగితే.. మూడు రోజుల తరువాత ఘటన వెలుగులోకి వచ్చిందని సీవీ ఆనంద్ తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని అన్నారు. పెద్దమ్మ గుడి సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో అత్యాచారం జరిగిందని అన్నారు. బెంజ్ కారులోని వీడియోలను నిందితులే సర్క్యులేట్ చేశారని తెలిపారు. నిందితుల్లో ఒకరికి మరో నెల రోజుల్లో మైనార్టీ తీరుతుందని అన్నారు. మొత్తం ఐదుగురు ఆమెపై అత్యాచారం చేశారని అన్నారు. ఘటనకు సంబంధించి గ్యాంగ్ రేప్, ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని అన్నారు. ఘటనలో నిందితులకు 20 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్షపడే అవకాశం ఉందని అన్నారు. కొందరికి జీవితకాలం శిక్ష పడొచ్చని తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని సీవీ ఆనంద్ అన్నారు. కేసు విచారణ ఆలస్యం జరగడానికి వివిధ కారణాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి కేసులను జాగ్రత్తగా విచారించాల్సి ఉంటుందని.. అందుకే కేసు విచారణలో కొంతవరకు జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు. అత్యాచారం కేసు దాదాపుగా పూర్తయ్యిందని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.