హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona Deeksha : సీతక్క, ఆరోగ్యశ్రీ దీక్ష భగ్నం.. ఖండించిన వైఎస్ షర్మిల

Corona Deeksha : సీతక్క, ఆరోగ్యశ్రీ దీక్ష భగ్నం.. ఖండించిన వైఎస్ షర్మిల

ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క

ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క

Corona Deeksha :కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అమరణ నిరహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు.

కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద అమరణ నిరహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఆరోగ్యం నేడు క్షీణించిడంతో అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు..ఇక అరెస్ట్ అనంతరం సీతక్కను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజులుగా ఆమె దీక్ష చేస్తున్న నేపథ్యంలో సోమవారం రాత్రీ కూడ ఆమె ఇందిరాపార్క్ వద్దే నిద్రించింది..కాగా ఈ దీక్షను కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్యర్యంలో చేపట్టారు.

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ దీక్ష

తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే..దీంతో కరోనా భారిన ప్రజలు వైద్యం చేయించుకోలేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడ సౌకర్యాలు ఉన్నా...పాజిటీవ్ సోకిన వారు ఎక్కువ శాతం ఉండడంతో అవి ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకోంది. ప్రవైటు ఆసుపత్రుల్లో చికిత్సపైనే కరోనా పాజీటీవ్ సోకిన వారు ఆధారపడుతున్నారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఫీజుల వసూలు చేస్తుండడం, కావాల్సిన మందులు సైతం బ్లాక్ మార్కెట్ ‌కు తరలడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. దీంతో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం ద్వార ప్రవేట్‌లో కనీస చికిత్స అవకాశాలు ఉన్నాయని , దీంతో పాటు ప్రజలకు ఎలాంటీ ఇబ్బంది లేకుండా ఉంటుందని సీతక్క డిమాండ్ చేశారు.

corona : 25 రోజుల్లో.. కరోనాతో ఎంతమంది చనిపోయారో తెలుసా...కోర్టుకు నివేదిక ఇచ్చిన ప్రభుత్వం


సీతక్కకు మద్దతు పలికిన వైఎస్ షర్మిల

ప్రజల ప్రాణాల పై పాలకులకు పట్టింపు లేకపోయిన ఒక మహిళ గా సీతక్క.. మీరు ఈ రోజు ప్రజల పక్షాన .. వారి ఆరోగ్యం కోసం దీక్ష చేసినందుకు .. మిమ్మల్ని అభినందించడమే కాకుండా మీకు మా సంపూర్ణ మద్దతును తెలుపుతున్నామని ఆమె తెలిపారు.కరోనా ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న MLA సీతక్క కు ఎటువంటి పరిష్కారం చూపకుండానే, ఈ రోజు ప్రభుత్వం .. పోలీసులు కలిసి దీక్షను భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని షర్మిల ట్విట్టర్ ద్వార తెలిపారు.

తెలంగాణలో 23లక్షల మందికి కరోనా టెస్టులు

కాగా తెలంగాణలో అధికారులు అందించిన లెక్కల ప్రకారం నిన్న ఒక్కరోజే 10వేల మంది కరోనా పాజిటీవ్ భారిన పడ్డారు. కాగా ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 70వేలకు పైగా ఉండగా మొత్తం రాష్ట్ర్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై రోజుల్లో 41 మంది చనిపోయినట్టు ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చింది. దీంతోపాటు 25 రోజుల్లో మొత్తం 23 లక్షల మందికి టెస్టులు చేసినట్టు కోర్టుకు వివరించింది. అయితే అధికారికంగా కరోనాతో చనిపోతున్న వివరాలు తప్పుగా ఉంటున్నాయనే అరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కంటే అదనంగా కరోనా భారిన పడినవారు చనిపోతున్నారనే విమర్శలు వెళ్లుతెత్తుతున్నాయ. ఇంతపెద్ద మొత్తంలో కరోనా ఆరోగ్య శ్రీలో చేర్చడం ద్వార ప్రజలకు లభ్ది చేకూరుతుందని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..పార్టీ కార్యకర్తలతో కలిసి ఇందిరాపార్క్ వద్ద దీక్ష కొనసాగించారు.

Published by:yveerash yveerash
First published:

Tags: Aarogyasri, Corona cases

ఉత్తమ కథలు