హోమ్ /వార్తలు /తెలంగాణ /

Raja Singh: డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ.. ఈ సారి ఫిర్యాదు ఏంటంటే ?

Raja Singh: డీజీపీకి ఎమ్మెల్యే రాజా సింగ్ లేఖ.. ఈ సారి ఫిర్యాదు ఏంటంటే ?

రాజాసింగ్​ (File Photo Credit:Twitter)

రాజాసింగ్​ (File Photo Credit:Twitter)

రక్షణ కోసం పదేపదే కోరుతున్నా స్పందించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనపై కేసులున్నాయని పోలీస్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తుందని రాజా సింగ ఆరోపించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి వార్తాల్లోకి ఎక్కారు. తాజాగా ఆయన తెలంగాణడీజీపీ అంజనీ కుమార్ కు లేఖ రాశారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. 8 నెంబర్ల నుంచి తనకు వార్నింగ్ కాల్స్ వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు  ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని రాజాసింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని లైసెన్స్ గన్ ఇవ్వాలని డీజీపీని కోరారు.

రక్షణ కోసం పదేపదే కోరుతున్నా స్పందించడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తనపై కేసులున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పోలీస్ శాఖ.. కేసులున్న ఎవ్వరికీ లైసెన్స్ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. తనకు పాకిస్థాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ తన లేఖలో తెలిపారు.

అంతకుముందు కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ పలు సార్లు వార్తల్లో నిలిచారు. ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ మొరాయిస్తుందని.. పలుమార్లు ఆయన సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర డీజీపీకి, హోమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయిన కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై తరుచూ సీఎంకీ, డీజీపీకి లేఖ రాస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఇటీవల ఆయన ప్రగతి భవన్ ముందు ఆ వాహనాన్ని వదిలేసి వెళ్లారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇచ్చింది. 2017 మోడల్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌ను రాజసింగ్‌కు కేటాయించారు. ఈ విషయం పై రాజాసింగ్ స్పందించారు. తెలుపు రంగు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ధూల్ పేటలోని తమ ఇంటికి పోలీసులు తీసుకు వచ్చి పెట్టి వెళ్లారని చెప్పారు. కొత్త కారే తనకు కావాలని లేదని..మంచి కండిషన్ ఉన్న బుల్లెట్ వాహనం ఇస్తే తనకు అదే చాలని ఆయన స్పష్టం చేశారు.

First published:

Tags: Local News, Raja Singh, Telangana Police

ఉత్తమ కథలు