హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..తెలంగాణ సిట్ కు వరుస షాకులు

Telangana News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..తెలంగాణ సిట్ కు వరుస షాకులు

సిట్ కు వరుస షాకులు

సిట్ కు వరుస షాకులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల కస్టడీ పొడగింపు కావాలని సిట్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కస్టడీ పొడిగింపు పిటీషన్ ను కొట్టేసింది. మరోవైపు నిన్న అంబర్ పేట న్యాయవాది ప్రతాప్ కు సిట్ నోటీసులు ఇవ్వగా..దానిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీనితో కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ప్రతాప్ ను అరెస్ట్ చేయొద్దు అంటూనే రేపు సిట్ విచారణకు ప్రతాప్ హాజరు కావాలని ఆదేశించింది.  

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సిట్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిల కస్టడీ 10 రోజుల పాటు పొడగింపు కావాలని సిట్ ఏసీబీ కోర్టు (Acb Court) ను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కస్టడీ పొడిగింపు పిటీషన్ ను కొట్టేసింది. మరోవైపు నిన్న అంబర్ పేట న్యాయవాది ప్రతాప్ కు సిట్ నోటీసులు ఇవ్వగా..దానిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. దీనితో కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాల వరకు ప్రతాప్ ను సిట్ అరెస్ట్ చేయొద్దు అంటూనే రేపు సిట్ విచారణకు మాత్రం ప్రతాప్ హాజరు కావాలని ఆదేశించింది.

  తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. పెరగనున్న గ్రూప్-2, 3, 4 ఖాళీలు.. జీవో విడుదల చేసిన సర్కార్

  ఏసీబీ కోర్టులో అలా..

  ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సిట్ పిటీషన్ వేసింది. నిందితులకు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన రెండు రోజుల కస్టడీని నిందితుల తరపు న్యాయవాది తెలిపారు. అయితే ఆ విచారణలో పూర్తి సమాచారం రాలేదని తెలిపిన సిట్ మరోసారి కస్టడీకి ఇవ్వాలని పేర్కొంది. రెండో రోజు విచారణలో కీలక సమాచారం రాబట్టలేకపోయాం అని సిట్ తెలిపింది. అయితే గతంలో కస్టడీకి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసిన ఏసీబీ కోర్టు సిట్ పిటీషన్ ను తిరస్కరించింది. కాగా గతంలో నిందితుల బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీనితో వారు సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారు. అయితే బెయిల్ విషయం హైకోర్టు (High Court) లో పిటిషన్ వేయాలని సుప్రీం తెలిపింది. రెండు రోజుల్లో వారు హైకోర్టు (High Court) లో బెయిల్ పై పిటీషన్ వేసే అవకాశం ఉంది.

  హైకోర్టులో ఇలా..

  ఇక ఈ కేసులో ఇటీవల మరో ఇద్దరికీ సిట్ నోటీసులు ఇచ్చింది. అందులో ఒకరు నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య కాగా మరొకరు అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్. వీరిలో నందకుమార్ భార్య విచారణకు నోటీసుల్లో పేర్కొన్న తేదీన రాలేనని, వేరే తేదీలో వస్తానని సిట్ కు చెప్పుకొచ్చింది. ఇక లాయర్ ప్రతాప్ నోటీసులపై హైకోర్టు (High Court) కు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రతాప్ తరపు వాదనలు విని కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రతాప్ ను అరెస్ట్ చేయొద్దని, నోటీసుల్లో పేర్కొన్న తేదీల్లో విచారణకు హాజరు కావాలని హైకోర్టు (High Court) తెలిపింది.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case