మిస్సింగ్ మిస్టరీ విషాదంతం.. చెరువులో సుమేధ మృతదేహం లభ్యం

news18-telugu
Updated: September 18, 2020, 4:41 PM IST
మిస్సింగ్ మిస్టరీ విషాదంతం.. చెరువులో సుమేధ మృతదేహం లభ్యం
సుమేధ
  • Share this:
హైదరాబాద్‌:  నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయినా చిన్నారి సుమేధ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. శుక్రవారం బండచెరువు వద్ద బాలిక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. వివరాలు.. గురువారం సాయత్రం నేరెడ్‌మేట్ ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల సుమేధా సైకిల్ తీసుకుని బయటకు వెళ్లింది. చాలా సేపటికి కూడా బాలిక ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో నిన్న కురిసిన భారీ వర్షానికి దీన్‌దయాళ్ నగర్‌లో నాలాలు పొంగిపోర్లినట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు.

దీంతో ఆ దిశలో పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడి సమీపంలోని ఓపెన్ నాలాలో సుమేధ సైకిల్ బయటపడింది. దీంతో ఆమె కొట్టుకుని నాలాలో కొట్టకుని పోయి ఉండవచ్చని పోలీసులు భావించారు. జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ స‌హాయంతో పోలీసులు బాలిక ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే చివరకు బండచెరువు వద్ద బాలిక మృతదేహం లభించింది. దీంతో ఆ చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇక, ప్రమాదవశాత్తు బాలిక నాలాలో పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Published by: Sumanth Kanukula
First published: September 18, 2020, 4:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading