హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్‌లో తీవ్ర కలకలం.. పట్టపగలే ఏటీఎం వద్ద కాల్పులు..

Hyderabad: హైదరాబాద్‌లో తీవ్ర కలకలం.. పట్టపగలే ఏటీఎం వద్ద కాల్పులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పటేల్ కుంట చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నగరం మొత్తం వెతుకున్నారు.

  హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేగింది. పట్టపగలే కాల్పుల మోత మోగింది. కూకట్‌పల్లి పటేల్ కుంట పార్క్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎటీఎంలో డబ్బులు నింపుతుండగా సెక్యూరిటీ గార్డుతో పాటు ఏటీఎం సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం ఏటీఎంలో నింపేందుకు తెచ్చిన నగదును ఎత్తుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిని అలీ బేగ్, సీహెచ్ శ్రీనివాస్‌గా గుర్తించారు,. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి 2 బుల్లెట్లు, ఒక బుల్లెట్ లాక్ లభ్యమయ్యాయి. దుండగులు మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పటేల్ కుంట చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పారిపోయిన దుండగుల కోసం గాలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నగరం మొత్తం వెతుకున్నారు. శివారు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్‌లను కూడా అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పులు జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటన పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితులను వీలైనంత త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime news, Gun fire, Hyderabad, Telangana

  ఉత్తమ కథలు