Home /News /telangana /

HYDERABAD MINORS END THEIR LIVE AFTER FAILING LOVE IN HYDERABAD FULL DETAILS HERE ABH

Hyderabad: 19 ఏళ్లకే ప్రేమ, పెళ్లి.. ప్రేమ కథలో ఊహించని విషాదం!...

శ్రీకాంత్, నిఖిత (ఫైల్)

శ్రీకాంత్, నిఖిత (ఫైల్)

కాలం మారుతున్నప్పటికీ  ప్రజల్లో మాత్రం ఏ మార్పూ రాలేదు. కులమనే పిచ్చి మత్తులో బతుకుతున్నారు  ప్రజలు. తల్లిదండ్రుల ఆప్యాయతల మధ్య బతకాల్సిన వాళ్ళు ప్రేమ మోజులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ (Online) పరిచయాలు చాలా ఎక్కువగా పెరిగాయి. ఆ పరిచయాలు కొన్ని ప్రేమగా మారి , ప్రేమ వివాహాలకు దారితీస్తున్నాయి. పెద్దల్ని నొప్పించి పెళ్లి చేసుకున్నాక కూడా... కులమనే (Caste) కారణంగానో చాలా వరకు ప్రేమ జంటలు విడిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పెళ్లయ్యాక కూడా తల్లిదండ్రులు వారి పరువు కోసం ప్రేమ జంటలను విడగొడుతూ ఉన్నారు. కాలం మారుతున్నప్పటికీ ప్రజల్లో మాత్రం ఏ మార్పూ రాలేదు. కులమనే పిచ్చి మత్తులో బతుకుతున్నారు ప్రజలు. తల్లిదండ్రుల ఆప్యాయతల మధ్య బతకాల్సిన వాళ్ళు ప్రేమ మోజులో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేవలం కులం వేరు కావడం కారణంగానే ఇద్దరు ప్రేమికులను విడదీసిన కారణంగా వారు ఆత్మహత్య చేసుకున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ (Hyderabad) నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ నగర్ లో నివసించే శ్రీకాంత్ (20)కి సుమారు రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియా (Social Media) లో రాజేంద్రనగర్ (Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నిఖిత తో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమగా మారి శ్రీకాంత్, నికిత జూన్ నాలుగవ తేదీన వివాహం చేసుకున్నారు.

    ఇది చదవండి: జీవితాన్నిచ్చిన మేనమామ అంత పనిచేస్తాడనుకోలేదు.. పాపం క్రాంతి


    వివాహం చేసుకున్న తర్వాత నెల రోజులు పాటు ఇల్లు కిరాయికి తీసుకుని కలిసి ఉన్నారు, నికిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు శ్రీకాంత్ కోసం గాలించి వివరాలు సేకరించగా శ్రీకాంత్ మైనర్ అని తేలడంతో నికితను తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రీకాంత్ బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం నికిత శ్రీకాంత్ పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉండేవారు కానీ నిఖిత తల్లిదండ్రులకు శ్రీకాంత్ వేరే కులం వాడు కావడంతో ఈ పెళ్లి ఇష్టం లేదని తద్వారా పోలీసుల సహాయంతో నిఖితను శ్రీకాంత్ ను విడగొట్టారని తెలిపారు. ఈనెల 15న నిఖిత ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న శ్రీకాంత్ ఆగస్టు 17న నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక నగర్ రైల్వే గేట్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

    ఇది చదవండి: వెతికే కొద్దీ బయటపడుతున్న అక్రమ పీడీఎస్ రైస్: ఒకే రోజు 155 క్వింటాలు స్వాధీనం


    రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాధంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో చనిపోవడానికి ముందు ఫ్రెండ్స్‌తో చేసిన చాటింగ్ వైరల్ అవుతోంది. ఇది కేవలం నికిత తల్లిదండ్రులు చేసిన పొరపాటు కారణంగానే ఇద్దరు ప్రేమికులు చనిపోయారని శ్రీకాంత్‌ బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే నిఖిత ఆత్మహత్య చేసుకుందంటే తాము నమ్మడం లేదని.. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Crime news, Hyderabad, Local News, Telangana

    తదుపరి వార్తలు