HYDERABAD MINOR GIRL HAS BEEN SENTENCED TO LIFE IMPRISONMENT AND FINED RS 10000 FOR REPEATEDLY INTOXICATING HER WITH COFFEE VB
Sexually Harrassment: అతడికి 32.. ఆమెకు 17.. కాఫీలో మత్తు మందు కలిపి పలుమార్లు అత్యాచారం.. చివరకు..
ప్రతీకాత్మక చిత్రం
Sexually Harrassment: మైనర్ బాలికకు కాఫీలో మత్తు మందు కలిపి ఇచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10వేలు జరిమానా విధించారు. ఈ ఘటన ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చుట్టుపక్కల ఇళ్లల్లో ఉండే వారితో మంచిగా మెలుగుతాడు. వారి ఇళ్లల్లో సొంత మనిషిలా ఉంటూ ఇంటి పనులను కూడా చేసేవాడు. అతడితో అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఓ ఇంట్లో ఇంటర్ చదువుతున్న బాలిక(17)పై అతడి చూపు పడింది. వారి ఇంట్లో మంచిగా నటిస్తూ బాలికను వలలో వేసుకున్నాడు. మాయమాటలు చెప్పుకుంటూ లొంగదీసుకున్నాడు. ఓ రోజు తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఇంటికి వెళ్లిన తనకు కాఫీ తెస్తానంటూ.. ఆ కాఫీలో మత్తు మందు కలిపి ఆ బాలికకు ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత పులు మార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. వారి కుటుంబసభ్యులు 2015 ఆగస్టు 8న ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సురేశ్.. నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. దీనికి సంబంధించి ఘట్కేసర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఘట్కేసర్ మండల కేంద్రంలో నివాసముంటున్న వంగూరి ప్రవీణ్‌కుమార్ అలియాస్ కుమార్(32) నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటి పక్కన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెకు కాఫీలో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిడండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ ఘటన 2015 ఆగస్టు 8న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం ట్రయల్‌కు రాగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బి.సురేష్.. కేసులో దోషి ప్రవీణ్‌కుమార్‌కు జీవితఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధించారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడేల కృషిచేసిన అప్పటి సీఐలు రవీందర్, ప్రకాష్, సీడీవో శివకుమార్, అడిషనల్ పీపీ రాజిరెడ్డి, ప్రస్తుత సీఐ చంద్రబాబులను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్‌బాబు అభినందించి రివార్డు ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.