Home /News /telangana /

HYDERABAD MINOR GIRL ENDS LIFE AFTER LOVER THREATENS TO MARRIAGE IMMEDIATELY IN BANJARAHILLS SU

Hyderabad: ప్రియుడి బెదిరింపులు.. చిక్కులు వస్తాయన్న తండ్రి.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో..

ప్రతీాకాత్మక చిత్రం

ప్రతీాకాత్మక చిత్రం

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక.. 5వ తరగతి వరకు చదివి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిస్థితులు ఆ బాలికకు తలనొప్పిగా మారాయి.

    ఓ పెళ్లి చేసుకోవాలంటూ ప్రియుడు బెదిరింపులకు దిగడం.. మరోవైపు మైనారిటీ తీరకుండా పెళ్లి చేసుకుంటే చిక్కులు వస్తాయని తండ్రి చెప్పడంతో ఓ బాలిక తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన కండ్రకోట దుర్గాభవానీ(16) 5వ తరగతి చదివి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అనే యువకుడితో కొంతకాలంగా పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో కల్యాణ్.. తనను పెళ్లి చేసుకోవాలని దుర్గాభవానీపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

    తమ పెళ్లికి అంగీకరించాలని కల్యాణ్, దుర్గాభవానీని తీసుకుని ఆమె తండ్రి శ్యాంసన్ వద్దకు వెళ్లాడు. అయితే మైనారిటీ తీరకముందే పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని శ్యాంసన్ వారిని హెచ్చరించాడు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా దుర్గాభవానీని మందలించారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం ఆమె ఇంట్లో ఎవరికి చెప్పకుండా.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2 ఇందిరా ఇందిరానగర్‌లో ఉంటున్న అక్క వెంకటలక్ష్మి వద్దకు వచ్చింది. అయితే చెల్లి దుర్గాభవానీ తన వద్దకు వచ్చిన విషయాన్ని వెంకటలక్ష్మి తడ్రికి ఫోన్ చేసి చెప్పింది.

    దీంతో శ్యాంసన్ శనివారం ఉదయం హైదరాబాద్ వచ్చాడు. కూతురికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కల్యాణ్.. తామిద్దరం పెళ్లి చేసుకుంటామని, అడ్డొస్తే ఎవరినైనా చంపేస్తానని బెదిరించాడు. అయితే దుర్గాభవానీ కుటుంబ సభ్యులు మాత్రం మైనారిటీ విషయం ప్రస్తావించగా.. కల్యాణ్ అవేమీ పట్టించుకోలేదు. కల్యాణ్ బెదిరించి వెళ్లడంతో.. కుటుంబ సభ్యులు ఇదే విషయంపై చర్చించారు. ఇక, సాయంత్రం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో.. దుర్గాభవానీ చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

    ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నాలుగేళ్ల తర్వాత భార్యది తన కులం కాదని తెలియడంతో..

    17 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన 23 ఏళ్ల మహిళ.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..

    ఇక, రాత్రి వరకు ఇంటికి తిరిగివచ్చిన కుటుంబ సభ్యులు దుర్గాభవానీ ఆత్మహత్య చేసుకోవడం చూసి షాక్ తిన్నారు. ఈ విషయంపై దుర్గాభవానీ తండ్రి శ్యాంసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె మృతికి కల్యాణ్ వేధింపులే కారణమని ఆయన ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, East godavari, Hyderabad, Suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు