హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం -పరుగులు తీసిన జనం

Hyderabad : గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం -పరుగులు తీసిన జనం

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, పలు వార్డుల్లోకి పొగ వ్యాపించడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. బాలింతలు పరుగులు తీశారు. కాగా, ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయపడటంకానీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

ఇంకా చదవండి ...

జంటనగరాల్లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకటైన గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ లో గల గాంధీ ఆస్పత్రిలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పలు వార్డుల్లోకి పొగ వ్యాపించడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. బాలింతలు తమ శిశువులతో బయటికి పరుగులు తీశారు..

గాంధీ ఆస్పత్రి నాలుగో అంతస్తులో లేబర్ డిపార్ట్‌మెంట్ విద్యుత్ బోర్డులో షార్ట్ సర్య్కూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు ఆందోళనతో కేకలు వేశారు. మంటలను చూసి అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది.. ఫైరింజన్ సర్వీసుకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు.

లేబర్ డిపార్ట్మెంట్ లో తలెత్తిన అగ్నిప్రమాదం వల్ల ఆస్పత్రిలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా సిబ్బంది.. రోగులను బయటికి పంపేశారు. బాలింతలు తమ శిశువుల్ని ఎత్తుకుని బయటికొస్తున్న దృశ్యాలు కనిపించాయి. కాగా, ఈ ఘటనలో ప్రాణనష్టంగానీ, గాయలు కానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Published by:Madhu Kota
First published:

Tags: Fire Accident, Gandhi hospital, Hyderabad

ఉత్తమ కథలు