Home /News /telangana /

HYDERABAD MINISTERIAL CLARITY YCP MLA RK ROJA IS STEPPING DOWN AS A JABARDASTH JUDGE IN THE LATEST PROMO SNR

RK ROJA:జడ్జీగా ఔట్..మంత్రిగా ఇన్..వైరల్ అవుతున్న వీడియో విట్‌నెస్‌

(జడ్జీగా ఔట్..మంత్రిగా ఇన్)

(జడ్జీగా ఔట్..మంత్రిగా ఇన్)

RK ROJA: ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జీ ఆర్కే రోజా మంత్రి పదవి కన్ఫామ్ అయింది. రోజా మంత్రి పదవిపై ఇంత కాలం జరుగుతున్న ప్రచారంపై ఎక్స్‌ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆమె స్థానంలో హీరోయిన్ లైలా, లేద ఆమని కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...
వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA),కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్ (Jabardasth)జడ్జీ ఆర్కే రోజా (RK Roja)మరో ఉన్నతమైన పదవి చేపట్టబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అది దాదాపు కన్ఫామ్ అనే సంకేతం వచ్చేసింది. ఈమధ్య కాలంలో ఆలయాలను దర్శించుకోవడం, గుళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో రోజాకు ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిందనే టాక్ గట్టిగా పినిపించింది. రీసెంట్‌గా మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్ రిలీజ్ చేసిన ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే రోజా ఇకపై జబర్ధస్త్‌లో జడ్జీ(Zabardast judge)గా కాకుండా ..ఏపీ మంత్రివర్గంలో క్యాబినెట్‌ హోదాలో కనిపించబోతుందని పక్కాగా అర్ధమవుతోంది. అందుకే ఎన్నో సంవత్సరాలుగా తాను జడ్జీగా వ్యవహరిస్తున్న టాప్‌ టీవీ షోకి తాను తప్పుకొని కొత్త జడ్జీలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా ఉంది ప్రోమో. తనకు ఎంతో పేరు, గుర్తింపు తెచ్చిన ఎంటర్‌టైనమెంట్ ప్రోగ్రామ్‌కి రోజా తప్పుకోవడం చూస్తుంటే ఏపీ మంత్రిగా కన్ఫామ్‌(Ministerial Clarity) అయిందని ఫ్యాన్స్, టీవీలు చూస్తున్న ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. మరి రోజా జబర్దస్త్‌ని వదిలి వెళ్లిపోతే ఆమె స్థానంలో ఎవర్ని జడ్జిగా ఉంచితే బెటర్ అనే దానిపైనే ఇద్దరు మాజీ హీరోయిన్లు లైలా (Laila), ఆమని (Amani)కు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు రోజా. అది కూడా నెక్స్ట్ టెలికాస్ట్ కాబోయే ప్రోమోలోనే చూపించారు.

ఎమ్మెల్యే రోజా మంత్రిగా కన్ఫామ్..
ఎగిరే పావురమా సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ లైలా ఇకపై జబర్ధస్త్ జడ్జీగా వ్యవహరిస్తుందనే సంకేతం ఇచ్చింది మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్. అందుకే ఈ ప్రోమోలో రోజాతో పాటు నటి ఆమని, లైలాకు కంటెస్టెంట్స్ చేసే స్కిట్‌లను ఎలా రిసీవ్ చేసుకోవాలి..ఎలా కామెంట్ చేయాలి..ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలనే విషయాలపై రోజా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా గమ్మత్తేంటంటే ఈ ప్రోమోలో ఆమని నువ్వు జడ్జీగానే ఉన్నావుగా మళ్లీ ఎందుకు అని రోజా అంటే నేను బాగా చేస్తే లైలాను ఎందుకు పిలుస్తారని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రోజా జబర్దస్త్ నుంచి ఔట్ అని..ఆమె పొజిషన్‌లో చొట్ట బుగ్గల హీరోయిన్ లైలా నెక్స్ట్ జడ్జీ అని తేలిపోయింది.

ఆ కామెడీ షోకి వేరే హీరోయిన్ జడ్జీ ..
ఈనెల 25వ తేది అంటే శుక్రవారం టెలికాస్ట్ కాబోయే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ఎపిసోడ్ చూస్తే ఎమ్మెల్యే రోజా ఏం సెలవిస్తారు ? నిజంగా ఆమె హీరోయిన్‌ లైలాకు జడ్జీగా ట్రైనింగ్ ఇచ్చారా ? లేక ఒక ఎపిసోడ్‌లో ప్రేక్షకుల్ని నవ్వించడం కోసమే ఈ ప్రోమో వదిలారో తెలిసిపోతుంది. ప్రచారాలు, వార్తలు ఎలా ఉన్నా రోజా మంత్రి కాబోతున్నారనే ప్రచారాన్ని మాత్రం ఎమ్మెల్యే ఆర్కే రోజా తెగ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. చూడాలి రోజా ఏప్రిల్ నెల నుంచి ఏపీ క్యాబినెట్‌లో కనిపిస్తారో లేక మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్ జబర్ధస్త్‌లో కనిపిస్తారో లేదంటే రెండు చోట్ల కనిపిస్తూ డ్యూయెల్ రోల్ పోషిస్తారో అనే చర్చ సోషల్ మీడియాలో తెగ జరుగుతోంది.
Published by:Siva Nanduri
First published:

Tags: AP cabinet, Extra jabardasth, Nagari MLA Roja

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు