తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండగ జంట నగరాల్లో వైభవంగా జరుగుతుంది. లష్కర్ బోనాలుగా పిలిచే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ ఆలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి, బోనాలు సమర్పిస్తారు. ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైంది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి సురటి అప్పయ్య ఆధ్వర్యంలో ఆలయానికి బీజం పడింది. బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసిన అప్పయ్య.. విధుల్లో భాగంగా 1813లో ఉజ్జయినిలో పనిచేస్తున్న సమయంలో అక్కడ కలరా ప్రబలి చాలా మంది చనిపోయారు. అయితే మహమ్మారి మరింతమందిని బలితీసుకోకుండా ఉజ్జయినిలోని అమ్మవారే కాపాడినట్లు భక్తులు నమ్ముతారు. అయితే గత రెండేళ్ల నుంచి అమ్మవారి ఉత్సవాలు సాదాసీదాగానే నిర్వహించారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే బోనాలను (Bonalu) రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తుచేశారు. అన్ని దేవాలయాలకు నిధులు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టంచేశారు. జూలై 17, 18వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (ecunderabad-Ujjain Mahakali) అమ్మవారి బోనాల ఉత్సవాలు (Bonalu celebrations) నిర్వహిస్తామని తెలిపారు. భక్తులంతా సమిష్టిగా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా కారణంగా గత రెండు ఏండ్లుగా బోనాల ఉత్సవాలు (Bonala Utsavalu) సరిగ్గా నిర్వహించలేదని, ఈసారి ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి, అనువంశిక చైర్మన్ సురిటి కామేశ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎవరూ భయపడరని అన్నారుతలసాని శ్రీనివాస్ యాదవ్ . దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సవాల్ విసిరారు. తాము కూడా రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని తలసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా కొడుక్కి బీసీసీఐతో సంబంధం ఏంటని తలసాని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ఖండించాలని ఆయన సూచించారు.
అంతకుముందు నిన్న తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీపై (TRS) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి హరీశ్ రావు. గురివింద గింజ తన కింద నలుపు చూసుకోవాలంటూ చురకలు వేశారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు బీజేపీలో (BJP) లేడా ..? మీది కుటుంబ పార్టీ కాదా .. ? అని ఆయన ప్రశ్నించారు. యూపీలో బీజేపీ పొత్తు పెట్టుకున్న అప్నాదళ్ (Apna dal) కుటుంబ పార్టీ కాదా అని హరీశ్ రావు నిలదీశారు. పంజాబ్‌లో గతంలో అకాళీదళ్‌తో (Shiromani akali dal) అధికారం పంచుకోలేదా.. అది కుటుంబ పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.