తెలంగాణ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కల కన్నాను దాన్ని నిజం చేసుకున్నాను నా అంత అదృష్టవంతుడు ఎవడు లేడని మల్లారెడ్డి అన్నారు. ఇక తన కొడుకును డాక్టర్ ను \చేస్తే తనకు డాక్టర్ కోడలు గిఫ్ట్ గా వచ్చింది. రెడ్డి అమ్మాయిని చేస్తే పిక్నీక్ లు, కిట్టి పార్టీలు అంటూ వెళ్లేదని మల్లారెడ్డి (Minister Mallareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేజీలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
నా మూడో కొడుకు అంటూ ఎమోషనల్..
ఇక పిల్లలను పిక్నీక్, బర్త్ డే పార్టీలని తల్లిదండ్రులే చెడగొడుతున్నారని మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు. కొన్ని కావాలంటే మరికొన్ని వదులుకోవాలని అన్నారు. ప్రేమ, ఫ్రెండ్ షిప్ కు దూరంగా ఉండాలి. కొన్ని సాధించాలంటే మరికొన్నింటిని వదిలేయాలని అన్నారు. ఇక తన తన కొడుకును డాక్టర్ ను చేస్తే తనకు డాక్టర్ కోడలు గిఫ్ట్ గా వచ్చింది. రెడ్డి అమ్మాయిని చేస్తే పిక్నీక్ లు, కిట్టి పార్టీలు అంటూ వెళ్లేదని మల్లారెడ్డి (Minister Mallareddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక నా కోడలుకు అమ్మ నాన్న లేరని, తను నాకు మూడో కొడుకని చెప్పుకొచ్చాడు.
ఐటీ రైడ్స్ పై మల్లారెడ్డి రియాక్షన్..
ఇక ఐటీ రైడ్స్ (IT Rides) తో నేనేమి భయపడలేదు. నేనేమి క్యాసినో ఆడించలేదు. కాలేజీలు నడిపిస్తున్న అని అన్నారు. మెడికల్ కాలేజీలో డొనేషన్లు లేవు. అన్ని ఆన్ లైన్ అడ్మిషన్లే. నన్ను కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పటికే మూడు బ్యాచ్ లు రాకుండా అడ్డుకున్నారు. కానీ నాకు ఇప్పుడు తుఫాన్ వచ్చిన తట్టుకునేంత దైర్యం వచ్చింది. నా ఇంటిపై 400 మంది ఐటీ అధికారులు దాడులు చేశారు. వాళ్ల పని వాళ్లు చేసుకొని వెళ్లిపోయారన్నారు.
రెడ్డి అమ్మాయిలపై వ్యాఖ్యలపై మల్లారెడ్డి వివరణ
ఇక రెడ్డి అమ్మాయిలపై మల్లారెడ్డి (Minister Mallareddy) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన స్పందించారు. తాను కావాలని అలా అనలేదు. ఫ్లోలో అలా వచ్చిందని అన్నారు. నేను రెడ్డి అమ్మాయిలను తక్కువగా చేసి మాట్లాడలేదని, మాట్లాడుతుంటే అలా వచ్చిందని మల్లారెడ్డి (Minister Mallareddy) అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Mallareddy, Telangana, Telangana News