వరుసగా ప్రముఖ రాజకీయ పార్టీలు, నాయకుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ కు గురవుతున్నాయి. ఇటీవల టీడీపీ, వైసీపీ పార్టీలు సహా పలువురు నాయకుల ఖాతాలను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఇక తాజాగా తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ (minister KTR) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తుంది. మంత్రి కేటీఆర్ (minister KTR) ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ట్విట్టర్ హ్యాండిల్ ను మార్చారు. రంగంలోకి దిగిన ఐటీ శాఖ అకౌంట్ ను గంటలోనే రికవరీ చేసినట్లు తెలుస్తుంది. కాగా గత బుధవారం కేటీఆర్ (minister KTR) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే..సీఎం కేసీఆర్ (Cm Kcr) వియ్యంకుడు, కేటీఆర్ (Minister KTR) మామ పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) గుండెపోటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. హరినాథరావు (Pakala Harinatha rao) కు మంగళవారం మధ్యాహ్నం 2.44 నిమిషాలకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటీన గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించారు. కాగా ఆరోగ్యం విషమించడంతో గురువారం పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కొత్త ఏడాది ముందు మామ మృతితో అటు కేటీఆర్ (Minister KTR), భార్య శైలజ (Shylaja) ఫ్యామిలిలో దుఃఖం నెలకొంది.
అయితే పాకాల హరినాథరావు (Pakala Harinatha rao) మృతి సమయంలోనే మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కాగా అప్పుడు ఈ విషయం బయటకు రాలేదు. అయితే ఏకంగా మంత్రి కేటీఆర్ (minister KTR) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కానీ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ మాత్రమే హ్యాకర్లు మార్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా హైదరాబాద్ వరుస అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ (minister KTR) శంకుస్థాపన చేస్తున్నారు. నిన్న కొత్తగూడ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసే దిశగా వెళ్తున్నామన్నారు. ఈ ఫ్లైఓవర్ తో ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని మంత్రి కేటీఆర్ (minister KTR) పేర్కొన్నారు. కాగా ఈ ఫ్లైఓవర్ ను రూ.263 కోట్లతో నిర్మాణం చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, KTR, Minister ktr, Telangana