తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ మెదక్ జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ కేటీఆర్ చేతుల మీదుగా ఐటీసీ పరిశ్రమ ప్రారంభం కానుంది. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఐటీసీ పరిశ్రమను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆ పరిశ్రమ ప్రతినిధులు తెలిపారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో ఐటీసీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పక్కన రూ.460 కోట్ల పెట్టుబడితో 59ఎకరాల్లో ఈ పరిశ్రమను నిర్మించారు. సోమవారం నుంచి ఉత్పత్తులను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానికంగా వేయిమంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.పరిశ్రమ ప్రారంభోత్సవంతో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధి దొరుకుతుందని చెబుతున్నారు.
మరోవైపు కేటీఆర్ రాకతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టు దిట్టం చేశారు. మరోవైపు పరిశ్రమ ప్రతినిధులు కూడా జోరుగా ఏర్పాట్లు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KTR, Local News, Minister ktr