తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కు మంత్రి కేటిఆర్ (Minister Ktr) మాస్ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ కోసం నా రక్తం, కిడ్నీ కూడా ఇస్తా. నేను క్లీన్ చీట్ తో బయటకు వస్తే కరీంనగర్ కమాన్ (Karimnagar kaman) దగ్గర ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా అని ప్రశ్నించారు. నేను ఇక్కడే ఉంటాను డాక్టర్లను తీసుకురమ్మను. నా రక్తం, గోర్లు, వెంట్రుకలు, చర్మం, అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తానని మంత్రి కేటీఆర్ (Minister Ktr) సవాల్ విసిరారు. కరీంనగర్ కు ఏమి చేశావంటే సమాధానం ఉండదు పిచ్చి కేకలు, పెడబొబ్బలు, గావు కేకలు తప్ప ఏమి చేతకాదు అని మండిపడ్డారు. మోడీ, బోడి, ఈడీ చేతకాక వేట కుక్కలని వదులుతున్నారని కేటీఆర్ (Minister Ktr) విమర్శించారు. గతంలో బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు, కేటీఆర్ డ్రగ్స్ కు బానిస. రక్తం, వెంట్రుకల నమూనా ఇస్తే నిరూపిస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ బండి సంజయ్ కి కౌంటర్ ఇచ్చారు.
గతంలో కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్..
కేటీఆర్ (Minister KTR) డ్రగ్స్ కు బానిస అయ్యాడని అతని వెంట్రుకలు, రక్త నమూనా ఇస్తే నిరూపిస్తామని బండి సంజయ్ (Bandi Sanjay) సవాల్ విసిరారు. ఇక నేను తంబాకు తింటానని కేటీఆర్ (Minister KTR) ప్రచారం చేస్తున్నారు. కానీ నాకు ఆ అలవాటే లేదని బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ట్విట్టర్ టిల్లుకు తంబాకుకు, లవంగానికి కూడా తేడా తెలియదని కేటీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నేను తంబాకు తింటాను అని అంటున్నారు దానికి నేను నా రక్తం నమూనా ఇస్తాను. అలాగే నా శరీరంలోని ఆ భాగాన్నైనా ఇస్తాను పరీక్షలకు కూడా సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇక కేటీఆర్ (Minister KTR) వెంట్రుకలు, రక్తం నమూనా ఇచ్చే దమ్ముందా అని బండి సంజయ్ (Bandi Sanjay) ప్రశ్నించారు. డాక్టర్ దగ్గరకు వెళ్లి రెండు వెంట్రుకలు, రక్తం ఇస్తే కేటీఆర్ (Minister KTR) డ్రగ్స్ తీసుకుంటాడో లేదో అనేది ఇట్టే తెలిసిపోతుందని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలోభాగంగా నిర్మల్ జిల్లా దిమ్మదుర్తిలో పాల్గొన్న బండి సంజయ్ (Bandi Sanjay) ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక హైదరాబాద్ , బెంగళూరు డ్రగ్స్ కేసును పక్కా రీఓపెన్ చేయిస్తామని, లంగ దందాలు, దొంగ దందాలు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా అని బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ టిల్లు బండారం బయటపడుతుందనే భయంతోనే హైదరాబాద్ , బెంగళూరు డ్రగ్స్ కేసు మూసివేయించారని అన్నారు. వాటిని మళ్లీ రీఓపెన్ చేయాలని దర్యాప్తు సంస్థలను కోరుతున్నామని బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు.
కేటీఆర్ రియాక్షన్..
బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలపై నేడు మంత్రి కేటీఆర్ గరం గరం అయ్యారు. పని చేయడానికి చేతకాదు కానీ పనికిమాలిన మాటలు మాత్రం చెప్తారని ఎద్దేవా చేశారు. అసలు నీకు తెలివి ఉందా. ఇవేం రాజకీయాలు అని బండి సంజయ్ ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, KTR, Telangana, Telangana News