Home /News /telangana /

HYDERABAD MINISTER KTR SAID THEY WOULD GO TO DELHI AND FIGHT IF NEEDED FOR THE YOUTH OF ADILABAD DISTRICT AND PUT PRESSURE ON THE CENTER FOR CCI PRV

Minister KTR: ‘‘ఆ జిల్లా యువత కోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తాం.. కేంద్రంపై ఒత్తిడి తెస్తాం”: మంత్రి కేటీఆర్​

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తెలిపారు.

    సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Cement Corporation of India) పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం పైన తెలంగాణ ప్రభుత్వం తరఫున మరింత ఒత్తిడి తీసుకువస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు (Minister of Industries K. Taraka ramaravu) తెలిపారు. ఆదిలాబాద్ యువత (Adilabad Youth) ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు అదిలాబాద్ (Adilabad) కి నాయకులు, జిల్లాలోని ఇతర ప్రముఖులు ఈ రోజు మంత్రి కేటీఆర్ ( Minister KTR) ను ప్రగతిభవన్లో కలిసి కంపెనీ పున ప్రారంభంపై మాట్లాడారు. దానికోసం చేపట్టాల్సిన ఆందోళన,  కార్యాచరణపై చర్చించారు. కంపెనీ పునః ప్రారంభం కోసం తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) తరఫున ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరిన విషయాన్ని కేటీఆర్​ గుర్తుచేశారు. సీసీఐ పున ప్రారంభానికి (For CCI restart) అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలను ఇస్తామని, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు తెలంగాణ ప్రభుత్వం నుంచి అందుతాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ( Minister KTR ప్రస్తావించారు.

    అప్పనంగా అమ్మి వేసేందుకు కుట్ర..

    ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ( Minister KTR) అన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మి వేసేందుకు కుట్ర చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్లోని సిసిఐ (CCI) పునరుద్ధరణ చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులను స్వయంగా కలిశామని, అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఇప్పటిదాకా కేంద్రం నుంచి ఏలాంటి సానుకూల స్పందన లేదన్నారు. ఇప్పటికే ఆదిలాబాద్లోని సిర్పూర్ పేపర్ మిల్లు ని ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత మాకు ఉందన్నారు.

    అవసరమైతే ఢిల్లీకి..

    జిల్లాకు సిరుల వరప్రధాయిని అయిన సింగరేణిని క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నాలకు కేంద్రం తెరలేపిందని కేటీఆర్  ( Minister KTR) అన్నారు. సీసీఐ విషయంలో అవసరమైతే అదిలాబాద్ యువత ప్రయోజనాల కోసం ఢిల్లీకి సైతం వెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఆదిలాబాద్​కు ఐటీ టవర్ ను మంజూరు చేస్తామని, దీంతో పాటు టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం సిద్ధం చేయాలని అధికారులను కోరినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

    బీజేపీ ఎంపీని నిలదీస్తాం..

    సీసీఐ ఏర్పాటు కోసం అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణ చేపడతామని మంత్రి కేటీఆర్ ( Minister KTR) కి స్థానిక నాయకత్వం తెలిపింది. ఈ విషయంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తామని వారు తెలిపారు.  ఆదిలాబాద్ కి చెందిన బీజేపీ ఎంపీ ని కేంద్ర ప్రభుత్వం పైన సీసీఐ పునరుద్ధరణ కోసం ఒత్తిడి తీసుకురావాలని నిలదీస్తామన్నారు. సీసీఐ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేయడం పట్ల ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న అదిలాబాద్ జిల్లా ప్రజల పట్ల ధన్యవాదాలు తెలిపారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Cement, Minister ktr

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు