HYDERABAD MINISTER KTR SAID THAT IF THERE ARE CLASHES IN THE NAME OF RELIGION IN TELANGANA IT WILL BE SUPPRESSED PRV
Minister KTR: ‘‘నేను చదువుకునే రోజుల్లో వారానికి మూడు సార్లు కర్ఫ్యూ ఉండేది.. ఇపుడు ప్రశాంతంగా ఉంది: మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)
మతం పేరుతో చిచ్చు పెడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని కేటీఆర్ చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో వారానికి రెండు మూడు రోజులు కర్ఫ్యూ (Curfew) ఉండేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడ్డాక ప్రశాంతంగా ఉందని కేటీఆర్ అన్నారు.
హైదరాబాద్ (Hyderabad) పరిధిలో మంగళవారం నాడు రూ. 495 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మంత్రి కేటీఆర్ ( Minister KTR) పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభల్లో మంత్రి మాట్లాడుతూ.. మతం (Religious) పేరుతో చిచ్చు పెడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో వారానికి రెండు మూడు రోజులు కర్ఫ్యూ (Curfew) ఉండేదన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ఏర్పడ్డాక ప్రశాంతంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఇపుడు రాష్ట్రంలో పనికిమాలిన పంచాయతీలు లేవన్నారు. మతం, కులం (Caste) పేరుతో రాజకీయాలను చేసే వారిని ఒ కంట కనిపెట్టాలని మంత్రి ప్రజలను కోరారు.
ఏ ఎన్నికలు లేకపోయినా రూ. 495 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని కేటీఆర్ (KTR) చెప్పారు. పాతబస్తీ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు. కొన్ని మెట్రో నగరాల్లో తాగునీటికి కష్టాలు ఉన్నాయన్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం తాగునీరు, విద్యుత్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీలో అవసరమైన చోట రోడ్లను విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Live: Addressing the gathering after laying foundation stone for Sardar Mahal building restoration works in Hyd https://t.co/OPRskwX4gq
కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో శాంతిభద్రతలను పటిష్టంగా కాపాడుకుంటున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) తెలిపారు. కులాలు, మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చిచ్చులో చలిమంటలు కాచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని ఆయన చెప్పారు. తామ ప్రభుత్వం నిర్మాణాత్మక రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ తెలిపారు.
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 19, 2022
న్యూ సిటీకి సమాంతరంగా ఓల్డ్ సిటీని కూడా అభివృద్ది చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.. గతంలో మోజాం జాహీ మార్కెట్‌ను చూసి బాధపడేవాళ్లం. ఇప్పుడు మోజాం జాహీ మార్కెట్‌ను అభివృద్ధి చేశామన్నారు. కులీకుత్‌బ్‌షా అర్బన్ డెవలప్మెంట్కు పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు.. వారసత్వ సంపదను కాపాడుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ ఢిల్లీలో చోటుచేసుకున్న మత హింసాత్మక ఘటనలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. విశ్వహిందూ పరిషత్ పోలీసులను బెదిరించిన వ్యాఖ్యలపై.. “వీరు దేశ చట్టానికి అతీతులా? హోం మంత్రి అమిత్ షాజీ ” అని ట్వీట్ చేశారు. అలాగే, "మీకు నేరుగా నివేదించే ఢిల్లీ పోలీసులపై ఇలాంటి దారుణమైన అర్ధంలేని మాటలు మీరు సహిస్తారా?" అని కేటీఆర్ ప్రశ్నించారు. అనుమతి లేకుండా ఊరేగింపు నిర్వహించినందుకు నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి స్థానిక విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత వీహెచ్‌పీ ఇలాంటి బెదిరింపులు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.