తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో తాజాగా కూకట్ పల్లి (Kukat Palli) నియోజకవర్గంలో రూ.28.51 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కే.పి.హెచ్.బి కాలనీ, ఫేజ్ - 9లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి. కాలనీ ఫేజ్ -7 లో నిర్మించిన ఆధునిక వైకుంఠధామాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. అలాగే పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, స్టార్మ్ వాటర్ నాలా, ఐ.డి.ఎల్ చెరువు మరియు హెచ్ఐజీ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో పురపాలక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, స్టార్మ్ వాటర్ నాలా, ఐ.డి.ఎల్ చెరువు మరియు హెచ్ఐజీ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి @KTRTRS శంకుస్థాపన చేశారు. pic.twitter.com/43QaBgPVkt
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2022
ఓల్డ్ బోయినపల్లి వద్ద వార్డు నెంబర్ 19లో రూ.4.48 కోట్ల వ్యయంతో చేపట్టే బోయిన్ చెరువు రిటైనింగ్ వాల్, మనససరోవర్ నాలా టీ జంక్షన్ పనులను కేటీఆర్ ప్రారంభించారు. అలాగే రూ.555 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఆలీ కాంప్లెక్స్ నుండి ఆర్.ఆర్.నగర్ ప్రాగా టూల్స్ బోయిన పల్లి వరకు స్మార్ట్ వాటర్ నాలా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక రూ.9.80 కోట్ల వ్యయంతో కూకట్ పల్లిలోని రంగధాముని చెరువు ఐడిఎల్.లేక్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో మంత్రి @KTRTRS పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కే.పి.హెచ్.బి కాలనీ, ఫేజ్ - 9 లో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే @mkrkkpmla, ఎమ్మెల్సీ @naveenktrs, మేయర్ @GadwalvijayaTRS పాల్గొన్నారు. pic.twitter.com/65bYNKGYLE
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 2, 2022
అలాగే మూసాపేట సర్కిల్ వార్డు నెంబర్ 15లో సి.ఎస్.ఆర్ కింద రూ.200 లక్షల వ్యయంతో బాలాజీ నగర్ లో హెచ్.ఐజి పార్క్ అభివృద్ధికి శంకుస్థాపన చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.