బిల్కిస్ బానో(Bilkis Bano)అత్యాచారం కేసులో మొత్తం 11 మంది నిందితులను గుజరాత్ బీజేపీ(Gujarat BJP)ప్రభుత్వం క్షమాభిక్ష పరుతో వదిలిపెట్టడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు దోషుల్ని విడిచిపెట్టడమే కాకుండా వారికి సన్మానం చేయడంపై ప్రజాసంఘాలు, మైనార్టీ నేతలు మండిపడుతున్నారు. జైలు నుంచి విడుదలైన 11మంది నిందితులు బ్రాహ్మణులేనని వారంతా సంస్కారవంతులని గోద్రా సిట్టింగ్ ఎమ్మెల్యే సీకే రౌల్జీ వ్యాఖ్యానించడాన్ని మజ్లీస్(AIMIM)పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్(Hyderabad)ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi)తీవ్రంగా తప్పుపట్టారు. మన దేశంలో కొన్ని కులాల వాళ్లు నేరం చేసినట్లు నిర్ధారణ జరిగినప్పటికి వాళ్లు జైలు నుంచి యధేచ్చగా విడుదల కావచ్చు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కొందరికి కులం, మతం ఏదైనా సరిపోతుందని అన్నారు. అంతే కాదు కనీసం గాడ్సేను(Godsey)దోషిగా నిర్ధారించి ఉరి తీసినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలని తెలిపారు.
రౌల్జీ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్ ..
గుజరాత్ బీజేపీ ప్రభుత్వం కులాల పేరుతో దోషుల్ని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇవన్నీ చేస్తోందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ మహిళా సాధికారత గురించి మాట్లాడిన రోజే... రెమిషన్ విధానం కింద ఆగస్టు 15న 2002 నాటి బిల్కీస్ బానో అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న 11 మంది దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బిల్కీస్ బానో అత్యాచార కేసులో కేవలం ముస్లిం అనే మతాన్ని చూడవద్దని ...ఇలాంటి ఘటనే వేరే మహిళలకు జరిగితే ఏం చేస్తారని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ. అంతేకాదు ప్రముఖ చానళ్లలో పని చేస్తున్న మహిళ యాంకర్‌లు ఈవిషయాన్ని లేవనెత్తాలని ..బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.
बिलकिस बानो केस में ख़वातीन एंकर ख़ामोश क्यों? बिलकिस बानो के म'आमले पर तमाम ख़वातीन एंकर को आवाज़ उठाने की जरूरत है। बिलकिस बानो केस 'इंसाफ़ का मसला' है। pic.twitter.com/ZvBwOvFAYp
— Asaduddin Owaisi (@asadowaisi) August 18, 2022
ఇదెక్కడి న్యాయం..
రేపిస్ట్‌లను విడుదల చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించిన గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటుచేసి కమిటీలోని ఇద్దరు బీజేపీ నేతల్లో ఎమ్మెల్యే రౌల్జీ ఒకరు. ఆయనే ఇప్పుడు దోషులు మంచివాళ్లని సత్ప్రవర్తన కలిగిన వాళ్లంటూ కితాబివ్వడంపై ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు సైతం సోషల్ మీడియా ద్వారా ఖండిస్తున్నారు.
“They are Brahmins, Men of Good Sanskaar. Their conduct in jail was good": BJP MLA #CKRaulji
BJP now terms rapists as ‘Men of Good Sanskar’. This is the lowest a party can ever stoop! ???? @KTRTRS @pbhushan1 pic.twitter.com/iuOZ9JTbhh
— YSR (@ysathishreddy) August 18, 2022
సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి..
తెలంగాణ మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదే విషయంపై బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. బిల్కిస్ బానొ అత్యాచార కేసు దోషుల విడుదల చేసిన వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలని ...దోషులను విడుదల చేస్తూ గుజరాత్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్త్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పౌరులకు చట్టంపై విశ్వాసం సన్నగిల్లకుండా ఉండడానికి, నిర్భయ వంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చేయడానికి ఈ సిగ్గుమాలిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Asaduddin Owaisi, Telangana News