హోమ్ /వార్తలు /తెలంగాణ /

Lock down fear: లాక్ డౌన్ ను త‌ల‌పిస్తున్న హైద‌రాబాద్ రోడ్లు.. మళ్లీ పల్లె బాట పట్టిన వ‌ల‌స జీవులు..

Lock down fear: లాక్ డౌన్ ను త‌ల‌పిస్తున్న హైద‌రాబాద్ రోడ్లు.. మళ్లీ పల్లె బాట పట్టిన వ‌ల‌స జీవులు..

పలు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వలస కూలీలంతా తిరిగి వెనక్కు వచ్చేశారు. దీంతోనే కేసులు భారీగా పెరిగాయని స్థానికులు అంటున్నారు.

పలు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతోంది. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిన వలస కూలీలంతా తిరిగి వెనక్కు వచ్చేశారు. దీంతోనే కేసులు భారీగా పెరిగాయని స్థానికులు అంటున్నారు.

Lock down fear: లాక్‌డౌన్‌ భయంతో వలస కూలీలు మళ్లీ స్వస్థలాల బాట పడుతున్నారు. వైరస్‌ విజృంభనతో ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంతో మళ్లీ భయం నెలకొంది. లాక్‌డౌన్ విధిస్తారని ఊహించుకుని కొందరు సొంతూళ్లకు పయనమవుతుండటంతో హైదరాబాద్​లో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులు స్వస్థలానికి తిరిగి వచ్చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  గత సంవత్సరం కరోనా కట్టడి నేపథ్యంలో ఉన్నట్టుండి లాక్ డౌన్ అన్నారు. ఈ సారి గత అనుభవాలను దృష్టి లో పెట్టుకొని ముందుగా నైట్ కర్ఫ్యూ పెట్టారు. అంతే కాకుండా కోవిడ్ కేసులు కూడా వివపరీతంగా పెరుగిపోతుండటంతో ఉపాధి అవకాశాలు నగరంలో తగ్గాయి. మళ్లీ మే 2 లేదా 3న లాక్ డౌన్ పెట్టే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూలీలు, బతుకుదెరువు కోసం వచ్చిన వారు పల్లె బాట పట్టారు. తెలంగాణ‌లో కోవిడ్ రోజురోజ‌కి పెరిగిపోతుంది. ఇప్ప‌టికే వేల సంఖ్య‌లో కోవిడ్ కేసులు రోజు న‌మోద‌వుతుంటే మ‌రో వైపు ప‌దుల సంఖ్య‌లో ఈ మ‌హామ్మారి బారిన ప‌డి ప్రాణాలు వ‌దులుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం నైట్ క‌ర్య్ఫూను పెట్టింది. అయితే న‌గ‌ర ప్ర‌జ‌లు కూడా స్వ‌చ్ఛందం గా లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. సుల్తాన్ బ‌జార్, గుజారాత్ గ‌ల్లీ లాంటి వ్యాపార సముదాయాల్లో ఇప్ప‌టికే స్వ‌చ్చంధంగా లాక్ డౌన్ ను ప్ర‌క‌టించుకున్నారు మార్కెట్ అసోషియేష‌న్లు. అయితే హైద‌రాబాద్ రోడ్లు కూడా కోవిడ్ కేసులు పెర‌గ‌డంతో వెలవెల బోతున్నాయి. లాక్ డౌన్ పెట్ట‌న‌ప్ప‌టికి రోడ్లు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తోన్నాయి. కోవిడ్ భ‌యంతో ఎవ‌రూ బ‌య‌ట‌కి రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో పాటు ఇప్ప‌టికే న‌గ‌రంలో ప‌లు ఉద్యోగాల కోసం వ‌చ్చిన యువ‌త త‌మ సొంత ఉర్ల బాట ప‌ట్టారు.

  న‌గ‌రంలో ప్ర‌ధాన బ‌స్ స్టేష‌న్లు అయిన జూబ్లీ బ‌స్ స్టేష‌న్, ఎంజీబీఎస్ లు ప్ర‌యాణికుల ర‌ద్ధీతో కిట‌కిట‌లాడుతున్నాయి. మ‌రో వైపు సికింద్ర‌బాద్ రైల్వే స్టేష‌న్ కూడా ఇత‌ర రాష్ట్ర వ‌ల‌స కార్మికుల‌తో కిట‌కిట‌లాడుతుంది. ఉద‌యం తొమ్మిది నుంచి రాత్రి వ‌ర‌కు అంత‌మాత్రంగా ప‌బ్లిక్ న‌గ‌ర రోడ్ల‌పై తిరుగుతున్నారు. అవ‌స‌రం ఉంటే త‌ప్ప ఎవ‌రు బ‌య‌ట‌కురావ‌డం లేదు. దీంతోపాటు వ‌చ్చె నెల 2 లేదా 3 తేదీల నుంచి లాక్ డౌన్ పెడ‌తార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చాలా వ‌ర‌కు అంద‌రూ సొంత ఊర్ల‌కు వెళ్లే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్య‌ల‌యాలు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వ‌డంతో ఐటీ ఉద్యోగులు మొత్తం ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌యిపోయారు. దీంతో ఎప్పుడూ ర‌ద్దీగా ఉండే హైటెక్ సిటీ, కొండాపూర్, అమీర్ పేట్ లాంటి ప్రాంతాలు చాలా నిర్మానుష్యంగా కనిపిస్తోన్నాయి.

  నిర్మణుష్యంగా మారిన నగర రోడ్లు

  వినియోగదారులు లేక వెలవెలబోతున్న షాపింగ్ కాంప్లెక్స్

  లాక్ డౌన్ పెట్ట‌కుండానే న‌గ‌రంలో చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ చాయాలు క‌నిపిస్తున్నాయి. ఎప్పుడు రద్దీగా ఉండే కోఠి, కూక‌ట్ పల్లి, చార్మీనార్ లాంటి ప్రాంతాల్లో కూడా ర‌ద్దీ చాలా వ‌ర‌కు త‌గ్గింది. కోవిడ్ పై ప‌జ‌ల్లో చాలా వ‌ర‌కు అవ‌గాహాన పెరుగుతుంద‌నే చెప్పుకోవాలి. చాలా వ‌ర‌కు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు మాస్క్ ధరిస్తున్నారు. మ‌రో వైపు మాస్క్ లేకపోతే భారీ ఫైన్లు వేస్తుండ‌డంతో అంద‌రూ ఈ నిబంధ‌న‌ను ఇప్పుడు పాటిస్తున్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రంలో ఏ మూల చూసినా ఏడాది క్రితం పెట్టిన లాక్ డౌన్ జాడ‌లే క‌నిపిస్తోన్నాయి. దీంతోపాటు లాక్ డౌన్ పై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది అనే దానిపై కూడా అంద‌ర్లో ఉత్కంఠ నెల‌కుంది. ఇప్ప‌టికే ప‌క్క రాష్ట్రాలు, క‌ర్ణాట‌క‌, త‌మిళనాడు, లాంటివి లాక్ డౌన్ ప్ర‌క‌టించాయి. దీంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇక్క‌డ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌న్న‌దే ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Lock down, Lock down fear, Migrats people, Night curfew, Telangana, Villagers

  ఉత్తమ కథలు