హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార హామీని నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార హామీని నెరవేరుస్తున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరబోతోంది. దానికి సంబంధించిన ప్రక్రియను కార్యరూపం దాల్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు.

హైదరాబాద్ నగర ప్రజలకు శుభవార్త. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ నగర ప్రజలకు నెలకు 20 వేల లీటర్ల తాగునీటిని ఉచితంగా అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ప్రక్రియను జలమండలి వేగవంతం చేసింది. ఇప్పటికే దీనికి సంబందించిన మార్గదర్శకాలను పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, మెమో.నెం. 13423/Engg.2/2020, పేరుతో జనవరి ఒకటిన జారీ చేశారు కూడా. జనవరి 12వ తారీఖున ఎస్పీఆర్ హిల్స్, రెహ‌మ‌త్ న‌గ‌ర్, బోరబండలో పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కేటీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. తాజాగా ఈ ప‌థ‌కాన్ని క్షేత్ర స్థాయిలో అమ‌లు చేయ‌డానికి మీటరు ఏర్పాటు, ఆధార్ అనుసంధానం ప్రక్రియను జ‌ల‌మండ‌లి వేగవంతం చేసింది.

డొమెస్టిక్ స్లమ్ వినియోగ‌దారుల కనెక్షన్లకు నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్ళిఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయ‌డానికి 165 మంది మీట‌ర్ రీడర్లకు జ‌ల‌మండ‌లి ప్రధాన కార్యాల‌యంలో ఒక‌రోజు శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. మిగ‌తా డొమెస్టిక్ వినియోగదారులు, బహుళ అంతస్తుల భవనం (ఎంఎస్‌బి)/ బల్క్ కనెక్షన్ల వినియోగదారులు ఇంటి య‌జ‌మాని యొక్క ఆధార్ ను వారి క్యాన్ నెంబర్లతో అనుసంధానించ‌డానికి దగ్గర్లోని మీ- సేవా కేంద్రాల‌ వద్దకు వెళ్ళి లేదా జలమండలి వెబ్ సైటు ను సందర్శించి ఈ  ప్రక్రియ ను పూర్తి చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తోంది.

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం తమ క్యాన్ నంబర్ కు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ ప‌థ‌కాన్ని పొందాలంటే డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు.,కానీ, పైన పేర్కొన్న  మిగతా వినియోగదారులు వారి కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీట‌రు ఏర్పాటు, ఆధార్ అనుసంధానం త‌దిత‌ర విష‌యాల‌పై జ‌ల‌మండ‌లి మ‌రింత స‌మాచారం రూపొందించింది.

1.డొమెస్టిక్ స్లమ్ ప్రాంతాల్లో వినియోగదారులు తమ క్యాన్ నంబర్లతో ఇంటి యజమాని యొక్క ఆధార్ అనుసంధానం సులభతరం చేయడానికి, జలమండలి 165 మీటర్ రీడర్లకు శిక్షణ ఇచ్చింది. వీరు నేరుగా ఈ ప్రాంతాల్లోని ఈ వినియోగ‌దారుల ఇంటివ‌ద్దే క్యాన్ (CAN) నెంబ‌ర్ కు  ఆధార్ అనుసంధాన‌ ప్రక్రియను పూర్తి చేస్తారు.

2. డొమెస్టిక్ వినియోగదారులు, బహుళ అంతస్తుల భవనం (ఎంఎస్‌బి)/ బల్క్ కనెక్షన్ల వినియోగదారులు ఇంటి య‌జ‌మాని యొక్క ఆధార్ ను వారి క్యాన్ నెంబర్లతో అనుసంధానం చేసుకోవ‌డానికి  దగ్గర్లోని మీ- సేవా కేంద్రాల‌ వద్దకు వెళ్ళి లేదా జలమండలి వెబ్ సైటు ను సందర్శించి ఈ  ప్రక్రియ ను పూర్తి చేసుకోవచ్చు.

3. కొంత మంది వినియోగ‌దారుల పేరు ఆధార్ కార్డ్ లో ఒక‌లాగా, జ‌ల‌మండ‌లి న‌ల్లా కనెక్షన్లకు మ‌రో లాగా ఉన్న వారు జ‌ల‌మండ‌లి త‌మ క్యాన్ నెంబర్లకు ఆధార్ ప్రకారం పేరు దిద్దుబాట్లు చేసే వెసులుబాటును జ‌ల‌మండ‌లి త‌మ వెబ్‌సైట్‌లో క‌ల్పిస్తుంది.

4. వినియోగ‌దారులు ఇత‌ర సందేహాల నివృత్తి కోసం కస్టమర్ రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ యొక్క‌ కాల్ సెంటర్ నెంబ‌ర్ 155313 ని సంప్రదించవచ్చు. ఇది రెండు షిఫ్టుల‌తో.. 25 లైన్లు మ‌రియు డెస్క్ ఎగ్జిక్యూటివ్ ల‌తో.. ఉద‌యం 9 గంట‌ల నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ప‌నిచేస్తుంది.

Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, HMWSSB, fulfilling, CM KCR, GHMC, election, campaign, promise, హైదరాబాద్, గుడ్ న్యూస్, జీహెచ్ఎంసీ, ఎన్నికలు, ప్రచారం, హామీ, సీఎం కేసీఆర్,
జలమండలి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు

మీట‌రింగ్ ఏజెన్సీల ఎంపానెల్మెంట్ :

5. జలమండలి ఆహ్వానం మేరకు ప‌లు ఏజెన్సీ లు మీటర్ల ఏర్పాటుకు ఆస‌క్తి క‌న‌పరిచాయి. జలమండలి పరిధి లో.. ప్రతీ డివిజన్ కు 2 ఏజెన్సీల చొప్పున 15 ఎంఎం మరియు 20 ఎంఎం సైజు మెకానికల్ మీటర్ల సరఫరా మ‌రియు మీట‌ర్ బిగింపు కోసం 24 ఏజెన్సీలు ఎంపిక‌ చేయబడ్డాయి.

6. 15 ఎంఎం, 20 ఎంఎం సైజు కనెక్షన్ క‌లిగిన‌ డొమెస్టిక్ వినియోగదారులు, బహుళ అంతస్తుల భవన వినియోగదారులు తమ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటుకు జ‌ల‌మండ‌లి వెబ్సైట్  www.hyderabadwater.gov.in లోని Free Water Supply Scheme ట్యాబ్ లోని Empanelled Metering Agencies ను ఎంపిక చేసుకుంటే, జ‌ల‌మండ‌లి అధికారికంగా ఎంపిక చేసిన మీట‌రింగ్ ఏజెన్సీల వివ‌రాల జాబితా ను పొంద‌వ‌చ్చు. అందులోని.. మీ ప‌రిధిలో ఉన్న ఏజెన్సీలను నేరుగా గానీ, ఫోన్ ద్వారా గానీ సంప్రదించి మీటర్లను కొనుగోలు చేసి అమ‌ర్చుకోవ‌చ్చు. దానికి సంబంధించిన ధ‌ర‌ను జ‌ల‌మండ‌లి ఇప్పటికే నిర్ణయించింది.

7. ప్రస్తుతం జ‌ల‌మండ‌లి డివిజ‌న్ల ప‌రిధిలో అన్ని ఏజెన్సీ ల వ‌ద్ద ఒక‌ లక్ష మీటర్లు అందుబాటులో ఉంచింది. అవ‌స‌రాన్ని బ‌ట్టి  అవ‌స‌ర‌మైన‌  మీటర్లను  తయారు చేయ‌డానికి మీట‌రింగ్  ఏజెన్సీలు అన్ని ఏర్పాట్లను చేసుకున్నాయి.

బిల్లింగ్ :

8. ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకున్న డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు తేదీ: 01.12.2020 నుండి ఈ స‌దుపాయాన్ని పొంద‌వ‌చ్చు.

9. డొమెస్టిక్ వినియోగదారులు, బహుళ అంతస్తుల భవనం (ఎంఎస్‌బి)/ బల్క్ కనెక్షన్ వినియోగదారులు  డిసెంబర్ మొదటి తారీఖు 2020 నాటికి ఫంక్షనల్ మీటర్లతో ఉండి,  వారు త‌మ‌ ఆధార్ అనుసంధాన ప్రక్రియను తేది. 1 ఏప్రిల్ 2021 లోపు పూర్తి చేసిన వారికి ఒకే సారి 4 నెల‌ల‌కు గాను దీనికి సంబందించిన బిల్లుల‌ను జారీ చేయ‌డం జ‌రుగుతుంది. అయితే ప్రతీ నెల 20 వేల లీట‌ర్ల లోపు వాడిన వినియోగ‌దారులు బిల్లు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. నీటి వినియోగం నెలకు 20 వేల లీటర్ల కు మించితే ఆ అదనపు వినియోగానికి బోర్డు టారిఫ్ ప్రకారం బిల్లు చెల్లించాలి.

10. డొమెస్టిక్ వినియోగదారులు, బహుళ అంతస్తుల భవనం (ఎంఎస్‌బి)/ బల్క్ కనెక్షన్ వినియోగదారులు 1 ఏప్రిల్ 2020 త‌రువాత‌ మీటర్ ఏర్పాటు చేసికొని, ఆధార్ అనుసంధాన ప్రక్రియ ను కూడా పూర్తి చేసిన వారికి అదే రోజు నుంచి 20 వేల లీట‌ర్ల ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. అంత‌కుముందున్న‌ కాలానికి అంటే 1 డిసెంబ‌ర్ 2020 నుంచి మీట‌రు బిగింపు, ఆధార్ లింక్ ప్ర‌క్రియ పూర్తి చేసిన రోజు వ‌ర‌కు బోర్డు టారిఫ్ ప్రకారం బిల్లు జారీ చేయ‌డం జ‌రుగుతుంది.

11. మార్చి 31 వ తేదీ లోపు మీట‌ర్లు అమ‌ర్చుకోని, ఆధార్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేయ‌ని వినియోగ‌దారుల‌కు 1 డిసెంబ‌ర్ 2020 నుంచి 31 మార్చి 2021 బోర్డు టారిఫ్ ప్రకారం సాధార‌ణ బిల్లు జారీ చేయ‌డం జ‌రుగుతుంది. అయితే ఈ 4 నెల‌ల కాలానికి ఎలాంటి వ‌డ్డీ కానీ, జ‌రిమానా కానీ విధించ‌బ‌డ‌దు.

12. ఇత‌ర‌ డొమెస్టిక్ వినియోగదారులు, బహుళ అంతస్తుల భవనం (ఎంఎస్‌బి)/ బల్క్ కనెక్షన్ వినియోగదారులు డిసెంబర్ మొదటి తారీఖు 2020 నాటికి ఫంక్షనల్ మీటర్లతో ఉన్న వారి ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయిన తరువాత..  ఆ రోజు నుండే ఈ పథకం వారికి కూడా అమల్లోకి వస్తుంది. అయితే నీటి వినియోగం నెలకు 20 వేల లీటర్ల కు మించితే ఆ అదనపు వినియోగానికి బోర్డు టారిఫ్ ప్రకారం బిల్లు వసూలు చేయబడుతుంది.

13. డిసెంబ‌ర్ 2020 మొద‌టి తేది నాటికి న‌ల్లా మీటర్లు ఏర్పాటు చేసుకోని డొమెస్టిక్ వినియోగదారులు, ఎంఎస్‌బి/బల్క్ కనెక్షన్ వినియోగదారులకు వారు త‌మ న‌ల్లా క‌నెక్ష‌న్ కు  మీటర్ అమర్చుకున్న తేదీ నుండి వీరికి ఈ పథకం వ‌ర్తిస్తుంది.

నెలకు 20 వేల లీటర్ల వరకు తాగునీటి ప‌థ‌కం ల‌బ్ది పొంద‌డానికి మీట‌ర్ ఏర్పాటు చేసుకుని ఆధార్ కార్డు అనుసంధాన ప్ర‌క్రియ.. మార్చి 31 తో గ‌డువు ముగిసినప్పటికీ తేది: 1 ఏప్రిల్ 2021 త‌రువాత కూడ మీట‌ర్ ఏర్పాటు చేసుకుని ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకున్న రోజు నుంచి ఈ ప‌థ‌కానికి అర్హులుగా ప‌రిగ‌ణించ‌బ‌డ‌తారు.

First published:

Tags: CM KCR, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, Water Crisis