జీహెచ్ఎంసీ పరిధిలో 28, 29 తేదీల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం...

మరమ్మతుల నేపథ్యంలో అలియాబాద్‌, మిరాలం, కిషన్‌బాగ్‌, రియాసత్‌నగర్‌, సంతోష్ నగర్‌, వినియ్‌నగర్‌, సైదాబాద్‌, అస్మాన్‌ఘడ్‌, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట, మూసారాంబాగ్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో నీటిసరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: August 25, 2019, 10:43 PM IST
జీహెచ్ఎంసీ పరిధిలో 28, 29 తేదీల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నాగార్జునసాగర్ కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న బండ్లగూడ కృష్ణాఫేస్‌ పైపులైన్లలో భారీ లీకేజీ ఏర్పడడంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 29న సాయంత్రం 6 వరకు 36 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటిసరఫరా ఉండదని వాటర్ వర్క్స్ అధికారులు తెలిపారు. మరమ్మతుల నేపథ్యంలో అలియాబాద్‌, మిరాలం, కిషన్‌బాగ్‌, రియాసత్‌నగర్‌, సంతోష్ నగర్‌, వినియ్‌నగర్‌, సైదాబాద్‌, అస్మాన్‌ఘడ్‌, చంచల్‌గూడ, యాకుత్‌పుర, మలక్‌పేట, మూసారాంబాగ్‌, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్‌, హిందీనగర్‌, నారాయణగూడ, అడిక్‌మెట్‌, శివం, చిలకలగూడ, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో నీటిసరఫరా ఉండదని అధికారులు తెలిపారు.

కృష్ణా ఫేస్‌- 2,3కు 28 బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని, 29న ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భోజగుట్ట, మారేడ్‌పల్లి, సైనిక్‌పురి ప్రాంతాల్లో నీటిసరఫరా ఉండదని తెలిపారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు