అమీర్ పేట‌లో నిలిచిన రైలు.. మెట్రో సర్వీసులకు అంతరాయం

హైటెక్ సిటీ నుంచి ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో రైలు అమీర్ పేట స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. విద్యుత్ లైన్‌లు తెగిపడడంతో మెట్రో ట్రైన్ ఆగిపోయింది.

news18-telugu
Updated: November 19, 2019, 9:12 PM IST
అమీర్ పేట‌లో నిలిచిన రైలు.. మెట్రో సర్వీసులకు అంతరాయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌‌ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఎల్‌బీనగర్ వెళ్తున్న మెట్రో రైలు అమీర్ పేట స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. విద్యుత్ లైన్‌లు తెగిపడడంతో మెట్రో ట్రైన్ ఆగిపోయింది. భారీ శబ్ధం రావడంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మెట్రో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎగ్జిట్ ఎగ్జిట్ డోర్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించారు. ఈ ఘటనతో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం సింగిల్ లైన్ విధానంలో రైళ్లను నడుపుతున్నామని.. మెట్రో రైళ్లు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సమస్య పరిష్కారానికి మెట్రో అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.First published: November 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...