హోమ్ /వార్తలు /తెలంగాణ /

రాత్రి పూట ప్రయాణించే వారికి హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్...

రాత్రి పూట ప్రయాణించే వారికి హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్...

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

హైదరాబాద్‌లో ప్రయాణికులు మెట్రో గుడ్ న్యూస్ అందించింది. మెట్రోలో రాత్రి పూట చివరి సర్వీస్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.

    హైదరాబాద్‌లో ప్రయాణికులు మెట్రో గుడ్ న్యూస్ అందించింది. మెట్రోలో రాత్రి పూట చివరి సర్వీస్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సందర్భంగా ప్రయాణికుల కోసం మెట్రో రైల్ తన సర్వీసులను పెంచింది. చివరి సర్వీస్‌ రాత్రి 11 గంటలకు ప్రారంభమై 11.50 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది. అయితే, ఇప్పుడు ఆ సర్వీస్‌ను కొనసాగిస్తున్నట్టు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఇకపై ఉదయం 6.30 గంటలకు తొలి సర్వీస్ ప్రారంభం అవుతుంది. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉదయం 6 గంటలకు సర్వీస్‌ను మెట్రో రైల్ నడిపింది. అయితే, ఇప్పుడు 6.30 నుంచి తొలి సర్వీస్ ప్రారంభం కానుంది. అలాగే, చివరి సర్వీస్‌ను రాత్రి 11 గంటలకు ఉంటుంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Hyderabad Metro

    ఉత్తమ కథలు