హోమ్ /వార్తలు /telangana /

ఆర్టీసీ సమ్మెతో... ప్రతీ 3 నిమిషాలకో మెట్రో రైలు

ఆర్టీసీ సమ్మెతో... ప్రతీ 3 నిమిషాలకో మెట్రో రైలు

ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.

ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.

ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు.

    తెలగాణలో ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగుతోంది. పొద్దున్నుంచి ఒక్క బస్సు కూడా రోడ్డెక్కలేదు. జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్‌లో బస్సులు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నేఆఫీసులకు వెళ్లేవారు, దసరా పండగలకు ఊళ్లకు వెళ్లేవారు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు సమ్మె దృష్ట్యా హైదారబాద్ మెట్రో రైలు కీలకనిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు సర్వీసుల్ని మరింత పెంచాలని నిర్ణయించింది.

    హైదరాబాద్‌లో టీఎస్ ఆర్టీసీ సమ్మెతో నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పండుగ వేళ ఊళ్లకు వెళ్లే వారిని దృష్టిలో పెట్టుకుని మెట్రో వేళలను సవరించారు. అర్థరాత్రి నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. తెల్లవారుజామున 5:30 గంటల నుంచి ప్రతీ మూడున్నర నిమిషాలకు ఓ రైలు చొప్పున రాత్రి 11:30 గంటల వరకు అందుబాటులో ఉంటాయని వివరించారు. నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీంతో పొద్దున్నే మెట్రో రైలన్నీ రద్దీగా మారాయి.

    First published:

    ఉత్తమ కథలు