CM KCR Birthday: 50 వేల మొక్కలు నాటిన హైదరాబాద్ మెట్రో...సీఎం కేసీఆర్ బర్త్ డే స్పెషల్

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నగర శివార్లలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని గొల్లూరు, బొంగులూరు జంక్షన్‌ సమీపంలోని తుర్కయాంజాల్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ వద్ద కూడా రెండుబ్లాక్‌లను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అర్బన్‌ ఫారెస్ట్‌బ్లాక్‌లను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తుందన్నారు.

news18-telugu
Updated: February 17, 2020, 10:46 PM IST
CM KCR Birthday: 50 వేల మొక్కలు నాటిన హైదరాబాద్ మెట్రో...సీఎం కేసీఆర్ బర్త్ డే స్పెషల్
మొక్కలు నాటిని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
  • Share this:
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ మెట్రో యాజమాన్యం వినూత్న కార్యక్రమం చేపట్టింది. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా నగరంలో 50వేల మొక్కలు నాటినట్లు సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఉప్పల్ మెట్రో డిపోలో ఆయన స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం మూడు కారిడార్లలోని మెట్రో స్టేషన్లు కింద వున్న సెంట్రల్ మీడియంలు, ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లో హైదరాబాద్ మెట్రో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటినట్లు మెట్రో ఎండీ తెలిపారు.ఈ సంందర్భంగా మెట్రో పిల్లర్లల కింద కూడా మొక్కలు నాటినట్టు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో కాలుష్యాన్ని నివారించడానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఇందుకోసం కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్‌కూడా కృషి చేస్తుందన్నారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో గ్రీనరీ పెంచడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా నగర శివార్లలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని గొల్లూరు, బొంగులూరు జంక్షన్‌ సమీపంలోని తుర్కయాంజాల్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ వద్ద కూడా రెండుబ్లాక్‌లను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ అర్బన్‌ ఫారెస్ట్‌బ్లాక్‌లను దత్తత తీసుకుని అభివృద్ది చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్‌అండ్‌టి ఎంఆర్‌హెచ్‌ఎల్‌ సీఓఓ అనిల్‌కుమార్‌, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ సీనియర్‌అధికారులు ఆనంద్‌మోహన్‌, బిఎన్‌రాజేశ్వర్‌ , బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు